26.3 C
Hyderabad
September 19, 2026
తూర్పుగోదావరిహోమ్

పవన్ కళ్యాణ్ పై వైసీపీ రెక్కీ?

#PavanKalyan

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 26వ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో ఒక అపరిచిత వ్యక్తి కదలికలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ పర్యటనలో ఒక వ్యక్తి ఉప ముఖ్యమంత్రి కి చేరువగా సంచరించారు. ఆ రోజు శంకరగుప్తం డ్రయిన్ మూలంగా దెబ్బ తిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్న సమయంలోనూ, అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలో, ఆ తరవాతి కార్యక్రమాల్లో సదరు వ్యక్తి ఉప ముఖ్యమంత్రి కి సమీపంలో సంచరించారు.

ఇతను రాజోలు నియోజక వర్గంలోని వైసీపీకి చెందిన కార్యకర్తగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం చేరింది. అతని వ్యవహార శైలి, కదలికలపై అనుమానం వ్యక్తమయింది. ఈ విషయాన్ని డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తీసుకువెళ్లారు. అతని కదలికలు, కార్యక్రమానికి జారీ చేసిన పాస్ అతను చేరడంపై ఉన్న సందేహాలను జిల్లా ఎస్పీకి వివరించారు. తగిన విచారణ చేపట్టాలన్నారు.

Related posts

రోడ్డు భద్రతకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ & రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు

Satyam News

పశ్చిమ బెంగాల్ లో ఉమ్మడి పౌరస్మృతి అమలు

Satyam News

వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులు పరిశీలించిన మంత్రి

Satyam News

కీసర గుట్ట పై శివ రాత్రి సందడి

Satyam News

హెరిటేజ్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైసీపీ

Satyam News

మంగళగిరిలో మరో ఎన్నికల హామీ పట్టాలపైకి…. లోకేష్ జెట్‌ స్పీడ్…!!

Satyam News

Leave a Comment