ప్రపంచంహోమ్

జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ సందేశం ఇదీ….

#ImaranKhan

పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రావల్పిండి అదియాలా జైల్లో తాను ఎదుర్కొంటున్న పరిస్థితులు మరింత విషమిస్తున్నాయని, జైల్లో త‌న‌కు ఏదైనా జరిగితే దానికి పూర్తిస్థాయిలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిం మునీర్‌ బాధ్యత వహించాలని ఆయన వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులతో, న్యాయవాదులతో భేటీకి అధికారాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని, తనపై మానసిక మరియు శారీరక ఒత్తిడి పెంచుతున్నారని అన్నారు. జైల్లో తాను సాధారణ ఖైదీల కంటే కూడా దారుణ పరిస్థితులకు గురవుతున్నానని ఆరోపించిన ఇమ్రాన్‌ ఖాన్‌, తన ఆరోగ్యం, భద్రతపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు, అంతర్జాతీయ వేదికలు జైల్లో జరుగుతున్న అన్యాయాలపై దృష్టి పెట్టాలని, తనపై జరుగుతున్న చర్యలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని ఆయన మండిపడ్డారు. పీటీఐ పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ, మాజీ ప్రధాన మంత్రిపై కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు.

Related posts

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ – వైసీపీ పొత్తు…?

Satyam News

నల్ల బ్యాడ్జీలతో విద్యుత్ ఉద్యోగుల నిరసన

Satyam News

బ్రెజిల్ లో లిథియం మైనింగ్ కి సింగరేణి

Satyam News

అమెరికాలో మండిపోతున్న పెట్రోల్ ధరలు

Satyam News

దేవాలయాల్లో భక్తుల్ని హతమార్చే భారీ కుట్ర

Satyam News

ఇద్దరు పిల్లలు భార్యతో ఆత్మహత్య చేసుకున్న నావికుడు

Satyam News

Leave a Comment