క్రీడలుహోమ్

టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్ !

#Bangaladesh

భద్రతా కారణాలను చూపుతూ భారత్‌లో వచ్చే నెల నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్ ను బంగ్లాదేశ్ బహిష్కరించింది. తాము కోరిన విధంగా మ్యాచ్ జరిగే స్థలాన్ని మార్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వేదిక మార్పు కోరుతూ బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది.

ఈ టోర్నమెంట్‌లో పాల్గొనబోవడం లేదని బంగ్లాదేశ్ ప్రకటించడంతో ఆ స్థానంలో స్కాట్లాండ్ ‌కు అవకాశం దక్కే పరిస్థితి ఏర్పడింది. భారత్‌కు రావడానికి అంగీకరించాలి లేదంటే టోర్నమెంట్‌ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని ఐసీసీ బుధవారం బంగ్లాదేశ్‌కు అల్టిమేటం జారీ చేసింది. ఆటగాళ్లు, అధికారులు, అభిమానుల భద్రతకు భారత్‌లో ఎలాంటి విశ్వసనీయమైన ముప్పు లేదని ఐసీసీ స్పష్టం చేసింది.

గురువారం లోపు నిర్ణయం తీసుకోవాలని గడువు విధించారు. టోర్నమెంట్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్ తదుపరి అర్హత గల జట్టు. అయితే కఠిన వైఖరితో ముందుకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, జాతీయ జట్టు ఆటగాళ్లతో సమావేశం అనంతరం ఐసీసీ అంచనాలు తమకు ఆమోదయోగ్యం కావని స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ ప్రకటించారు.

“వరల్డ్ కప్‌కు అర్హత సాధించేందుకు మా క్రికెటర్లు ఎంతో కష్టపడ్డారు. కానీ భారత్‌లో ఆడడంపై ఉన్న భద్రతా ఆందోళనలు ఇప్పటికీ మారలేదు. ఇవి కేవలం ఊహాగానాలపై ఆధారపడినవి కావు,” అని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. “మా జట్టు, జర్నలిస్టులు, ప్రేక్షకుల పూర్తి భద్రతను వారు నిర్ధారించగలరని మాకు నమ్మకం లేదు. అయినప్పటికీ మేము ఆశను వదులుకోలేదు.

మా జట్టు సిద్ధంగా ఉంది. శ్రీలంకలో ఆడేందుకు అనుమతి ఇస్తూ ఐసీసీ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం,” అని నజ్రుల్ అన్నారు. బంగ్లాదేశ్ టీమ్ భారత్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మూడు కోల్‌కతాలో, ఒకటి ముంబైలో. ఐపీఎల్‌లో “చుట్టూ చోటుచేసుకున్న పరిణామాల” కారణంగా బీసీసీఐ ఆదేశాలతో పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ‌ను తప్పించడమే భద్రతా ఆందోళనలకు ప్రధాన కారణమని బంగ్లాదేశ్ వర్గాలు చెబుతున్నాయి.

“ఆడకపోవడం వల్ల కలిగే నష్టాన్ని, ప్రమాదకరమైన ప్రాంతీయ రాజకీయ పరిస్థితుల్లోకి ఆటగాళ్లు, అభిమానులు, జర్నలిస్టులను నెట్టే విపత్తుతో పోల్చి చూడాలి. విదేశాల్లో పౌరుల భద్రతకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత,” అని నజ్రుల్ స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ఐసీసీ బుధవారం బంగ్లాదేశ్ భద్రతా వాదనలను తిరస్కరించింది. దేశీయ లీగ్‌లో ఒక ఆటగాడికి సంబంధించిన “ఒకే ఒక్క, వేరే అంశానికి సంబంధం లేని ఘటన”ను ఆధారంగా చేసుకుని టోర్నమెంట్‌లో పాల్గొనడాన్ని బీసీబీ లింక్ చేస్తోందని ఐసీసీ పేర్కొంది.

“బంగ్లాదేశ్ జట్టు భద్రతను గణనీయంగా దెబ్బతీసే స్వతంత్ర భద్రతా నివేదికలు లేనందున మ్యాచ్‌లను మార్చడం సాధ్యం కాదు. అలా చేస్తే ఇతర జట్లు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు లాజిస్టిక్, షెడ్యూల్ సమస్యలు తలెత్తుతాయి. ఐసీసీ పాలనలో తటస్థత, న్యాయం, సమగ్రతకు విఘాతం కలుగుతుంది,” అని ఐసీసీ స్పష్టం చేసింది.

“ఆటగాళ్లు పరిస్థితిని అర్థం చేసుకున్నారు”

బాయ్‌కాట్ నిర్ణయానికి ఆటగాళ్ల సమ్మతి ఉందా అన్న ప్రశ్నకు నజ్రుల్ స్పందిస్తూ, “ఆటగాళ్లతో సమావేశమై ప్రభుత్వ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను వివరించాం. ఇది గోప్య చర్చ కావడంతో వారు చెప్పిన వివరాలు వెల్లడించం. కానీ వారు పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు అనిపించింది,” అని తెలిపారు.

“దాదాపు 20 కోట్ల క్రికెట్ అభిమానులు ఉన్న దేశం బంగ్లాదేశ్. ఐసీసీ మాకు అనుకూలంగా స్పందించకపోతే అది ప్రపంచ క్రికెట్‌కు పెద్ద నష్టం, ఆతిథ్య దేశానికి వైఫల్యమే,” అని ఆయన అన్నారు. మాజీ కెప్టెన్ తమిమ్ ఇక్బాల్, ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ నజ్ముల్ హొసైన్ షాంటో వంటి ప్రముఖ ఆటగాళ్లు, క్రికెటర్ల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని బీసీబీ, ప్రభుత్వాన్ని కోరారు.

కఠిన వైఖరిని తీసుకోవద్దని సూచించినందుకు తమిమ్ ఇక్బాల్‌ను బీసీబీ సీనియర్ అధికారి ఒకరు “భారత్ ఏజెంట్” అంటూ విమర్శించడంతో వివాదం చెలరేగింది. ఈ పరిస్థితుల్లో ఆటగాళ్లకు భారీగా పారితోషిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఐసీసీ టోర్నమెంట్‌ల్లో గణనీయమైన ఫలితాలు సాధించలేదని చెప్పి వారికి పరిహారం ఇవ్వబోమని బీసీబీ డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం వ్యాఖ్యానించడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆటగాళ్ల ఆగ్రహంతో ఆయన బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

Related posts

ఐటీ పార్క్ నిర్మించాల్సిన చోట డంప్ యార్డా?

Satyam News

సుదూర లక్ష్యాలను చేధించే కుశ సిద్ధం చేసిన భారత్

Satyam News

సీఎస్ పదవీ కాలం పొడిగింపుకు మరో రిక్వెస్టు

Satyam News

శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం

Satyam News

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

Satyam News

అమెరికాకు లోకేష్..పెరిగిన అంచనాలు.!

Satyam News

Leave a Comment