గుంటూరుహోమ్

మంగళగిరి అభివృద్ధి చూసి వైసీపీకి భయం పట్టుకుంది

#PrideMangalagiri

రాష్ట్ర ఐటి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చూసి వైసీపీ నాయకులు అసహనానికి గురవుతున్నారని నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు.

గతంలో అభివృద్ధిని విస్మరించిన వారు ప్రస్తుతం ప్రజల్లో తమ మనుగడ కోల్పోతున్న పరిస్థితిని గమనించి రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, విద్యా మరియు వైద్య రంగాల అభివృద్ధి,యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అనేక కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తున్నారు.

ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పూర్తవగా, మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేక పోతున్నారని, తమ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను అధికార పార్టీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రావాలనే ఆశతో ఎలాంటి కుయుక్తులకైనా పాల్పడుతున్నారని, ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

మంగళగిరి అభివృద్ధి పథంలో దూసుకు పోతుండటాన్ని చూసి వైసీపీకి రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన మొదలైందని, అందుకే తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. అయితే ప్రజలు మాత్రం అభివృద్ధిని చూసే నిర్ణయం తీసుకుంటారని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి మద్దతుగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు.

Related posts

నేటి అర్ధరాత్రి నుండి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ

Satyam News

తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు

Satyam News

ఈ సారి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు లేనట్లే

Satyam News

బాబు దయతో బతికిపోయి…. జగన్‌ కుట్రలు, కుతంత్రాలు!

Satyam News

ఎట్టకేలకు ఇల్లు చేరిన పెద్దారెడ్డి !

Satyam News

ఫేస్ బుక్ కు కష్టకాలం: జుకర్‌బర్గ్ కు మోడీ ప్రభుత్వం వార్నింగ్

Satyam News

Leave a Comment