26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

రథసప్తమి రోజు చేయాల్సింది ఏమిటి?

సూర్యుడు అవతరించిన మాఘశుక్ల సప్తమి ,సూర్య జయంతి అనీ, రథసప్తమి అనీ ప్రసిద్ధికెక్కింది. మాఘ సప్తమినాడు సూర్యభగవానుడు రెండవసారి అవతరించాడు. సూర్యుని మెుదటి అవతారం వివస్వంతుడు.

అదితికి, కశ్యపునికి పుత్రునిగా రెండవసారి అవతరించాడు. ఆయనకు అదితి పుత్రుడు కనుక ఆదిత్యుడని, కశ్యప పుత్రుడు కనుక కాశ్యపేయుడనీ పేరు వచ్చింది. రథసప్తమి నాడు ఆవు పేడ ద్వారా తయారైన పిడకలపై క్రొత్త కుండలో కానీ లేదా ఇత్తడి పాత్రతో కానీ, ఆవు పాలతో పాయసం వండి చిక్కుడు కాయల రథం మీద, చిక్కుడు ఆకులు వేసి దాని మీద పాయసం పెట్టి సూర్యునికి నివేదించి, ఆపై ప్రసాదాన్ని స్వీకరించినవారు సకల పాపాల నుండి విముక్తిని పొంది, ఆరోగ్యాన్ని పొందుతారు.

ఈనాడు సూర్యుడు ఏడు గుర్రాలు పొదిగిన రథం మీద పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్య కాలంలో పయనిస్తూ లోకాన్ని సంతోష పెడతాడు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే స్నానం చేయాలి. అప్పుడే మాఘస్నాన ఫలితం వస్తుంది. ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేసి చేతిలోకి నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇవ్వాలి.

Related posts

తెలంగాణలో నేడు విద్యాసంస్థల బంద్‌కు ఎన్‌ఎస్‌యూఐ పిలుపు

Satyam News

కొడుకు హత్య కేసులో తల్లి తండ్రి అరెస్టు

Satyam News

శ్రీ కపిలేశ్వరాలయంలో విశేష‌ పూజ హోమ మ‌హోత్స‌వాలు

Satyam News

కడియం శ్రీహరి వ్యవహారశైలిపై మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

Satyam News

తల్లికి వందనం: ఈ నెల 22న తల్లుల ఖాతాల్లోకి రూ.10 వేల కోట్లు!

Satyam News

రాజాం జీఎంఆర్ ఇలాకా లో రెండు చోట్ల భారీ చోరీలు

Satyam News

Leave a Comment