25.2 C
Hyderabad
September 20, 2026
నెల్లూరుహోమ్

వీఎస్‌యూలో ముగిసిన ‘ఆంగ్ల బోధన’ జాతీయ సదస్సు

#VikramSimhapuriUniversity

నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU) ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సు బుధవారం ఘనంగా ముగిసింది. “ఆంగ్ల భాష మరియు సాహిత్య బోధనలో ఇటీవలి ధోరణులు” (Recent Trends in Teaching English and Literature) అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సు, ప్రధాన్ మంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (PM-USHA) నిధుల సహకారంతో విజయవంతంగా కొనసాగింది.

ముగింపు కార్యక్రమానికి అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. కె. సునీత మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఆధునిక బోధనా పద్ధతులు, సాంకేతికత ఎంతో అవసరమని పేర్కొన్నారు. విజ్ఞాన మార్పిడికి ఇటువంటి సదస్సులు గొప్ప వేదికలని ఆమె కొనియాడారు. గౌరవ అతిథిగా విచ్చేసిన శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (SKU) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎల్. ఐజాక్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచనా శక్తిని పెంచుతుందని తెలిపారు.

అదే విధంగా విద్యా ప్రమాణాల మెరుగుదలకు పరిశోధనాధారిత బోధన కీలకం అని స్పష్టం చేశారు. కార్యక్రమం అనంతరం ప్రతినిధులకు, పరిశోధకులకు రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా. యం. హనుమారెడ్డి విజయ (ఇంచార్జ్ ప్రిన్సిపాల్) డాక్టర్ రాజోలు ప్రభాకర్ (సదస్సు సమన్వయకర్త) డాక్టర్ శ్యామ్ సుందర్ భగవాన్ బోడవుల (విభాగాధిపతి మరియు అధ్యాపకులు డాక్టర్ బి. శామ్యూల్ మార్క్, వి. భాగ్యజ్యోత్స్న, టి. పాల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రామడుగులో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

Satyam News

ఇక పిల్లలకు నో సోషల్ మీడియా…..

Satyam News

అసభ్యకరమైన ప్రవర్తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉద్వాసన

Satyam News

కర్నాటకలో సోషల్ మీడియా పై నిషేధం

Satyam News

అమెరికా సుంకాల తగ్గింపు…ఎందుకో తెలుసా?

Satyam News

రోజా ఇంట్లో హెరిటేజ్ పాలు..వీడియో వైరల్‌!

Satyam News

Leave a Comment