26.3 C
Hyderabad
September 27, 2026
ప్రత్యేకంహోమ్

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే

#Amaravati

అమరావతిపై వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, దేవతల రాజధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.. దేశ ఆర్ధిక వ్యవస్థ తీరు తెన్నులను నిశితంగా పరిశీలించి, సమగ్ర అంచనాలను అందించే కేంద్ర ఆర్ధిక సర్వే అమరావతికి రెడ్‌ కార్పెట్‌ పరిచింది.. దేశంలో అమరావతిలాంటి గ్రీన్‌ ఫీల్డ్‌ నగరాలు అభివృద్ది చెందాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించింది.. దేశవ్యాప్తంగా నూతన నగరాలు ఆవిర్భవించడానికి ఇదే సరైన సమయం అని, ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌ అని ఎలుగెత్తి చాటింది ఆర్ధిక సర్వే..

కేంద్ర ఆర్ధిక సర్వే 2025-26.. అమరావతి హరిత నగర నిర్మాణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.. నగర నిర్మాణంలో అరుదైన అవకాశాలు అమరావతికి లభించాయని తెలిపింది.. ఈ తరహా నగర నిర్మాణాలను దేశవ్యాప్తంగా ప్రోత్సాహించాల్సిన సమయం ఇదే అని అభిప్రాయపడింది ఆర్ధిక సర్వే..

కేంద్ర ఆర్ధిక సర్వే సూచనలు వైసీపీకి మింగుడు పడడం లేదు.. కేంద్ర ఆర్ధిక సర్వేపై దేశంలోని పారిశ్రామిక, వాణిజ్య నిపుణులతోపాటు అంతర్జాతీయంగా అనేక దేశాల ఫోకస్‌ ఉంటుంది.. ఇదే ఇప్పుడు వైసీపీకి షాక్‌ ఇస్తోంది.. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్‌తోపాటు ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ అమరావతికి నిధులు అందిస్తోంది.. అంతర్జాతీయంగా క్వాంటమ్‌ కంపెనీలకు అడ్డాగా మారడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు.. కేంద్రం సైతం అమరావతి నగర నిర్మాణానికి చేయూత అందిస్తోంది..

మరోవైపు, దేశంలోని టాప్‌ నగరాలు అయిన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌… ప్రత్యేక ప్లానింగ్‌ లేకుండా నిర్మితమైనాయి.. చిన్న వర్షానికే డ్రయినేజ్‌లు పొంగి పొర్లుతున్నాయి.. రోడ్ల విస్తరణకు అవకాశం లేకుండాపోతోంది.. ఇక ట్రాఫిక్‌ చిక్కుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్‌… ఈ సమస్యలన్నింటికీ నూతన నగరాల సృష్టి అని ఆర్ధిక సర్వే చెప్పకనే చెబుతోంది.. ఈ తాజా పరిణామం అమరావతికి బిగ్‌ బూస్టప్‌గా భావించవచ్చని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.. దీంతో, అంతర్జాతీయ దృష్టితోపాటు దేశీయంగా అమరావతికి బ్రాండింగ్‌ పెరుగుతుందని చెబుతున్నారు ఎకనామిక్‌ ఎనలిస్టులు..

Related posts

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం: 21 మంది మృతి

Satyam News

దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కీలక నిర్ణయం

Satyam News

జోగి రమేష్… కబుర్లు ఆపి పోలీసులకు లొంగిపో…

Satyam News

మిరాకిల్ చేద్దాం రండి అంటున్న హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్

Satyam News

పెంచలయ్య కుటుంబానికి అండగా కోటంరెడ్డి

Satyam News

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరద

Satyam News

Leave a Comment