ముఖ్యంశాలుహోమ్

పర్యాటక రంగం అభివృద్ధితో మరింత గుర్తింపు

#TummalaNageswaraRao

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి కొత్త గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోందని వ్యవసాయం, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.

ఖమ్మం నగరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చేపట్టిన కీలక ప్రాజెక్టుల పురోగతిపై శుక్రవారం హైదరాబాద్ సచివాలయంలో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం ఖిల్లా రోప్‌వే నిర్మాణ పనుల స్థితిగతులు, ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. పనులు ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కమిషనర్ వల్లూరి క్రాంతి, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ ఆగస్స్యలతో మంత్రి తుమ్మల ఫోన్‌లో మాట్లాడారు. ఖమ్మం ఖిల్లా రోప్‌వే నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసి, అన్ని శాఖల సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని కోరారు.

ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ఖమ్మం ఖిల్లా రోప్‌వే పూర్తయితే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, హోటళ్లు, రవాణా, సేవా రంగాల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి తుమ్మల తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా ఖమ్మం నగరం ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని ఆయన అన్నారు.

Related posts

అసభ్యకరమైన ప్రవర్తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఉద్వాసన

Satyam News

సింధు జలాల ఒప్పందం రద్దుతో కష్టాల్లో పాక్

Satyam News

ఒంగోలులో ‘స్నేహ’ సేవా కార్యక్రమం

Satyam News

శ్రీ కంచి కామకోటి పీఠం విద్యాసంస్థల అడ్మిషన్లు ప్రారంభం

Satyam News

ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురండి

Satyam News

వైసీపీ నేత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టు

Satyam News

Leave a Comment