26.3 C
Hyderabad
September 19, 2026
కృష్ణహోమ్

జోగి రమేష్ ఇంటికి నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. అనంతరం నివాసానికి నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీగా అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అల్లర్లు మరింత చెలరేగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. దాడి జరిగిన సమయంలో జోగి రమేష్‌ తన నివాసంలో లేరని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పరిస్థితిపై ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Related posts

ఆదర్శ నియోజకవర్గంగా హుస్నాబాద్‌

Satyam News

భూ భారతి భూ సర్వే అవగాహనా కార్యక్రమంలో స్పీకర్

Satyam News

కెనడా సరిహద్దు మీదుగా భారతీయుల అక్రమ రవాణా

Satyam News

టీటీడీలో జాబులు అమ్ముకున్న భూమన…???

Satyam News

రైతులకే మా తొలి ప్రాధాన్యం: నాదెండ్ల మనోహర్

Satyam News

హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతున్న వాన

Satyam News

Leave a Comment