చిత్తూరుహోమ్

టీటీడీలో జాబులు అమ్ముకున్న భూమన…???

#BhumanaKarunakarreddy

వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అక్రమాలు జరిగాయి. రీసెంట్‌గా మరో స్కామ్‌ బయటపడింది. విచిత్రం ఏంటంటే.. కుంభకోణం వెనకున్న అసలు సూత్రధారే ఈ వ్యవహారం బయటికొచ్చేలా చేశారు. ఇంతకీ తిరుమలలో జరిగిన స్కామేంటి.. దాన్ని బయటపెట్టింది ఎవరంటే.. టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపణల గురించి మాట్లాడుకోవాలి.

పెంచలయ్య అనే ఒక కాంట్రాక్ట్‌ ఉద్యోగి.. తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు కానుకగా వేసిన బంగారాన్ని దొంగిలించాడు. 2025 జనవరి పదకొండున హుండీ దొంగని పోలీసులు పట్టుకున్నారు. విచారణలో దొంగతనం ఒప్పుకున్న పెంచలయ్యా.. మరో సంచలన విషయాన్ని బయటపెట్టాడు.

తిరుమల హుండీ ఆదాయాన్ని లెక్కించే పరకామణిలో తనకు కాంట్రాక్ట్‌ ఉద్యోగం ఇప్పించింది.. అప్పటి టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అని చెప్పాడు. ఈ జాబ్‌ కోసం భూమనకు 3 లక్షలు లంచం ఇచ్చానని బాంబు పేల్చాడు.

పోలీసుల విచారణలో పెంచలయ్య బయటపెట్టిన వివరాల ప్రకారం.. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీగా ఉద్యోగాలు అమ్ముకొన్నారని స్పష్టమవుతోంది. కల్తీ నెయ్యి కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి.. ఎప్పుడో దొరికిన దొంగ గురించి.. దొంగతనం గురించి మరోసారి రచ్చ చేయడం ద్వారా.. టీటీడీలో జాబ్స్ అమ్ముకొన్న స్కామ్ బయటపడింది.

అది కూడా భూమన కరుణాకర్‌రెడ్డే తన దగ్గర లంచం తీసుకొని కాంట్రాక్ట్‌ ఉద్యోగం ఇప్పించాడని పెంచలయ్య చెప్పిన విషయం వెలుగు చూడటంతో.. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడినట్లు అయింది.

ఇదే భూమన కరుణాకర్‌రెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో.. పరకామణిలో పని చేసే రవి కుమార్ అనే కాంట్రాక్ట్‌ ఉద్యోగి.. స్వామి వారి హుండీలో భక్తులు వేసిన విదేశీ కరెన్సీ దొంగతనం చేస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతను చాలా కాలం నుంచి చోరీ చేస్తున్నాడని విచారణలో తేలింది.

ఈ దొంగతో సెటిల్‌మెంట్‌ చేసుకున్న అప్పటి ప్రభుత్వ పెద్దలు.. కొంత సొమ్ముని శ్రీవారికి విరాళంగా ఇప్పించి.. మిగలిన వందల కోట్లను నొక్కేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ అసిస్టెంట్‌ విజిలెన్స్ ఆఫీసర్‌ సతీష్‌కుమార్‌.. సిట్‌ విచారణకు వెళ్తూ అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అపచారాల్లో బయటకు వచ్చినవే ఇంత దారుణంగా ఉంటే.. ఇంకా వెలుగు చూడని పాపాలు ఇంకెన్ని జరిగాయో అని భక్తులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

తెలంగాణ విద్వత్సభ దశాబ్ది మహోత్సవాలు

Satyam News

రూ.కోట్లు కొల్లగొట్టిన దాల్ మిల్ సూరి అరెస్టు

Satyam News

ఖాళీ పేజీలు, మ్యాన్యువల్ మార్కులు..APPSC స్కామ్‌లో నిజాలు!

Satyam News

నయనతార కు భర్త అంటే ఎంత ప్రేమో

Satyam News

పౌర్ణమి సందర్భంగా శ్రీశైల గిరిప్రదక్షిణ

Satyam News

డోనాల్డ్ ట్రంప్ ఏసుక్రీస్తు అవతారమా?

Satyam News

Leave a Comment