రంగారెడ్డిహోమ్

భూ భారతి భూ సర్వే అవగాహనా కార్యక్రమంలో స్పీకర్

#BhuBharati

వికారాబాద్ మండలం అత్వెల్లి గ్రామంలో జరిగిన భూ భారతి- భూసర్వే పై అవగాహన సదస్సులో ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా SP స్నేహ మెహ్రా, అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్, RTI మెంబర్ జాఫర్, AMC చైర్మన్ చేపల శ్రీనివాస్ ముదిరాజ్ మాజీ ZPTC మహిపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిజాం నవాబుల కాలంలో భూముల సర్వే జరిగింది. మళ్ళీ తొంబై ఏళ్ళ తరువాత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోని ప్రజా ప్రభుత్వం ఆద్వర్యంలో ఇప్పుడు భూముల రీ సర్వే జరుగుతుంది. అప్పటికి ఇప్పటికి టెక్నాలజీ బాగా పెరిగింది. ఇప్పుడు ఆధునిక సాంకేతిక పద్దతులను ఉపయోగించి  భూములను సర్వే చేస్తారు, సరిహద్దులు నిర్ణయిస్తారు.

ప్రతి సర్వే నెంబర్ కు మ్యాప్ ఇస్తారు. ఇదంతా మీ ముందే, మీ అనుమతి తోనే జరుగుతుంది. ఈ సర్వే వలన మీకు మంచి జరుగుతుంది, భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ వివరాలను అన్నింటిని సమీకృత భూ భారతి  పోర్టల్ లో నమోదు చేస్తారు. స్మార్ట్ ఫోన్ ద్వారా మీ భూమి వివరాలను, సరిహద్దులను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు.

ఈ సర్వేతో  భూమి ఉన్న వారందరికీ మేలు జరుగుతుంది. భూమికి సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులో ఉంటుంది.  భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. గ్రామాలలో భూమి పంచాయతీలు, గొడవలు ఉండవు,  ఎలాంటి లోటుపాట్లు లేకుండా, భూ యజమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అధికారులు సక్రమంగా సర్వే  చేయాలి. సర్వేకు గ్రామస్తులు అందరూ సహకరించాలి అని అన్నారు.

Related posts

కువైట్‌లో ప్రవాస భారతీయులు అప్రమత్తంగా ఉండాలి

Satyam News

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

Satyam News

ట్రంప్ ను తొలగించాలని డెమొక్రాట్ల డిమాండ్

Satyam News

ఆ పార్టీల పొత్తు కోసం జగన్‌ ఆరాటం…

Satyam News

తదుపరి సీఎస్ ఎవరు?

Satyam News

IGGAARL ను సందర్శించిన జర్మన్ ఫెడరల్ ప్రభుత్వ అంబాసిడర్

Satyam News

Leave a Comment