25.2 C
Hyderabad
September 20, 2026
సినిమాహోమ్

దర్శకుడు పీసీ ఆదిత్య కు ఛత్రపతి శివాజీ పురస్కారం…

#PCAditya

హిందూ మహా సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ మహారాజ్ జననం… 1630సంవత్సరం… ఫిబ్రవరి 19 తేది… నేడు 396 వ జయంతి… ఈ చారిత్రాత్మక సందర్బంగా భువనేశ్వర్ (ఒడిశా )కు చెందిన ప్రముఖ సాంస్కృతిక సంస్థ…FAMOUS PEOPLE INDIA WORLD వారు పలు రంగాల్లో నిష్ణాతులైన వారికి ప్రతిష్టాత్మక ఛత్రపతి శివాజీ పురస్కారాలను అందజేశారు…

ఇందులో భాగంగా తెలుగు సినీ దర్శకుడు, నిత్య ప్రయోగశీలి Dr. పీసీ ఆదిత్య కు ఛత్రపతి శివాజీ పురస్కారాన్ని అందజేశారు… సంస్థ అధినేత రాజేష్ పాండా మాట్లాడుతూ తెలుగు సినీ రంగం లో గత 30 సంవత్సరాలనుండి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఎందరికో కొత్త వారికి అవకాశాలు ఇస్తూ ప్రోత్సాహం ఇస్తున్నారు. ఆదిత్య సేవలు గుర్తించి ఛత్రపతి శివాజీ పురస్కారం అందించడం గర్వం గా ఉందన్నారు…

అవార్డు గ్రహీత Dr. పీసీ ఆదిత్య స్పందిస్తూ… ఛత్రపతి శివాజీ వీరచిత గాధల్ని కొన్ని భారతీయ భాషల్లో సినిమాలు గా వచ్చాయని, తెలుగు లో మాత్రం ఎవరూ సినిమా తీయకపోవడం బాధాకరమని, నిర్మాతలు ముందుకొస్తే ఆ సాహసం నేను చేస్తాను… ఇందులో కూడా కొత్త వారికి అవకాశం ఇస్తానన్నారు… ఈ సందర్బంగా ఆదిత్య ను ఆయన అభిమానులు మిత్రులు అభినందించారు.

Related posts

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె

Satyam News

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన  కళా వైభవం

Satyam News

అమరావతి ఖర్చుపై వైసీపీ ఫేక్ ప్రచారం… అసలు లెక్కలు ఇవే…!!

Satyam News

నేషనల్ ఛాంపియన్ షిప్ కు తెలంగాణ వాటర్ పోలో జట్టు

Satyam News

యువత రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి

Satyam News

యూట్యూబర్ పై దుండగుల కాల్పులు

Satyam News

Leave a Comment