వరంగల్హోమ్

ఐస్ క్రీమ్ లో వీర్యం కలిపిన ఘనుడు

ప్రజలకు అమ్మే ఐస్ క్రీమ్ లో తన వీర్యాన్ని, మూత్రాన్ని కలిపాడు.. ఒక వ్యక్తి. ఈ దారుణాన్ని చాటుగా సెల్ ఫోన్ లో చిత్రీకరించి ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా నెక్కొండలో రాజస్థాన్ కు చెందిన కాలురాం పుర్బియా అనే వ్యక్తి ఐస్ క్రీం బండి పెట్టుకున్నాడు.

అంబేద్కర్ కూడలిలో రోజూ ఐస్ క్రీం లు విక్రయిస్తుంటాడు. బహిరంగంగానే తన వీర్యాన్ని, మూత్రాన్ని ఐస్ క్రీం లో కలుపుతుండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఇది సోమవారం రాత్రి వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్ఐ మహేందర్ విచారణ చేపట్టి బహిరంగ ప్రదేశంలో హేయమైన చర్యకు పాల్పడ్డ కాలురాం పుర్బియా ను  అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

వరంగల్ జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్‌పెక్టర్ చేపూరి కృష్ణమూర్తి ఐస్ క్రీం బండికి సంబంధించిన శాంపిల్ సేకరించి ల్యాబ్ కు తరలించారు. పంచాయతీ కార్యదర్శి సదానందంతో కలిసి ఐస్ క్రీం బండి లోని ఐటమ్స్ బయట పారబోయించారు.

ఈ సందర్భంగా సీఐ చంద్రమోహన్ మాట్లాడుతూ బండ్లపై ఐస్ క్రీం తినుబండారాలు విక్రయించేవారు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నవారిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

బయట పదార్ణాలకు దూరంగా ఉంటేనే మంచిదని తెలిపారు. నెక్కొం డలో ఐస్ క్రీం అమ్మేవారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి హెచ్చరికలు జారీచేశారు.

Related posts

నారా దేవాన్ష్ యూట్యూబ్ చాన‌ల్ Dino Deets ప్రారంభం

Satyam News

జూలై నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Satyam News

ఫుట్‌పాత్ ఆక్రమణలపై అధికారుల కొరడా

Satyam News

ఢిల్లీ లిక్కర్ కేసులో తీర్పు చెప్పిన జడ్జి సామాన్యుడు కాదు…

Satyam News

సీఎం ప్రజావాణి లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ చెంచులు

Satyam News

పొలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా శ్రీకృష్ణదేవరాయలు

Satyam News

Leave a Comment