26.3 C
Hyderabad
September 19, 2026
నల్గొండహోమ్

రాములబండ వార్షిక బ్రహ్మోత్సవాలలో మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ మండలం రాములబండ గ్రామంలో శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి రథాన్ని లాగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామస్తులంతా ఏకమై వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయం అని తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని శ్రీ సీతా రామచంద్రస్వామిని ప్రార్థించినట్లు చెప్పారు.

అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, స్థానిక సర్పంచ్ చామకూరి శంకర్ గౌడ్, ప్రకాష్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు

Satyam News

సిగ్గుండాలి జగన్‌..ఎంపీ భరత్ మాస్ కౌంటర్

Satyam News

సీఎం చంద్రబాబు వాహన శ్రేణి కుదింపు

Satyam News

కుట్ర రాజకీయం చేస్తున్న నేరగాళ్లు

Satyam News

అవసరం లో ఉన్న వైసీపీ కార్యకర్త ను ఆదుకున్న మంత్రి లోకేష్

Satyam News

బ్యాంకాక్ పబ్ విషాదం: అగ్నిప్రమాదంలో 27 మంది మృతి

Satyam News

Leave a Comment