కృష్ణహోమ్

సీఎం చంద్రబాబు వాహన శ్రేణి కుదింపు

#CMConvoy

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వాహన శ్రేణిని కుదించుకున్నారు. మొత్తం 12 వాహనాల కాన్వాయ్‌ను 4 వాహనాలకు తగ్గించుకున్నారు. ఇవాల్టి నుంచే ఈ వాహన శ్రేణి కుదింపును అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచనలు జారీ చేశారు.

ఈ మేరకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తోనే సీఎం చేరుకున్నారు. ఇక నుంచి ఈ నాలుగు వాహన కాన్వాయ్ శ్రేణితోనే ప్రయాణించాలని సీఎం నిర్ణయించారు.

అటు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ మేరకు వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించుకున్నారు.

Related posts

భారత్‌ కు పాకిస్తాన్ రక్షణ మంత్రి హెచ్చరిక

Satyam News

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె

Satyam News

ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Satyam News

అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి

Satyam News

వ‌న‌స్థ‌లిపురం పీఎస్ లో సినీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ పై ఫిర్యాదు

Satyam News

ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధాని ఏమన్నారంటే

Satyam News

Leave a Comment