26.3 C
Hyderabad
September 19, 2026
కడపహోమ్

జాతీయ ప్రేరణ ఉత్సవ్ పోటీలకు పట్నం రెడ్డి సాయి ఎంపిక

భారత ప్రభుత్వ విద్య మం త్రిత్వ శాఖ పాఠశాల కోసం విద్యార్థుల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి రాజంపేట మండలం కొత్త బోయినపల్లి పీఎం శ్రీ ఎస్ జె ఎస్ ఎం జెడ్పీ హైస్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థి పట్నం రెడ్డి సాయి ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.బారతి తెలిపారు.

ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి, భారతీయ సంస్కృ తి, విలువలపై అవగాహన కల్పించడానికి రూపొందించబడిందన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు 9వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులు అర్హులన్నారు. ప్రతి జిల్లా నుండి ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థిల్ని ఎంపిక చేస్తారన్నారు.

ప్రతి వారం ఒక బ్యాచ్ నుంచి 20 మంది విద్యార్థులు పాల్గొంటార న్నారు. ప్రేరణ రెండో దశలో ఏప్రిల్ నెల మొదటి వారంలో గుజరాత్లోని వద్నగర్ లోని ఒక చారిత్రక పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు తన పాఠశాల విద్యార్థి పట్నం రెడ్డి సాయి ఎంపిక కావడం గర్వంగా ఉందని ఉపాధ్యాయులు మొలక ఓబులేసు,పుత్త జనార్ధన్,శేషగిరి, రాజయ్య,పారా శ్రీరాములు, ఎస్వీ.రామరాజు, శివ ప్రసాద్ గౌడ్,ఎస్. ప్రభాకర్ రావు,విజయ భాస్కర్, అనిల్,చెన్న కేశవులు, సువర్ణ సుందరి, అమరావతి,మధు వాణి, ప్రణవి,దార్ల శ్రీనివాసులు ఆచారి, ప్రశాంత్, మేడా సాయి నాథ్ తదితరులు అభినందించారు.

Related posts

దక్షిణ్ ఎనర్జీ ప్రమాద బాధితులకు న్యాయం చేస్తాం

Satyam News

కిషన్ రావుకు ఉద్వాసన

Satyam News

జగన్ సైతాన్ సైన్యం పై షర్మిల సంచలన ఆరోపణ

Satyam News

Karnataka Politics: ప్రియాంక్ ఖార్గేపై ఆర్ఎస్ఎస్ ఫిర్యాదు

Satyam News

Final: విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

Satyam News

మార్చి లో గూగుల్ కు భూమి పూజ

Satyam News

Leave a Comment