దళిత ఆదివాసి జేఏసీ సమావేశం స్థానిక శ్రీకాకుళం పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విజ్ఞాన్ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో వివిధ సంఘాల పెద్దలు కొన్ని ముఖ్యమైన తీర్మానాలను ప్రవేశపెట్టారు.
ఎస్సీ ఎస్టీ సబ్ కాస్ట్ లన్నీ కలిసిమెలిసి ఉండాలని వివిధ సంఘాల గా ఉన్న కుల సంఘాలన్నీ ఒక జేఏసీగా ఏర్పడి మండల జిల్లా రాష్ట్రస్థాయిలో దళిత సమస్యల మీద పనిచేయాలని దళిత ఆదివాసీల ఐక్యత సాటి చెప్పాలని వారి హక్కులను పరిరక్షించుకుంటూ సమాజంలో ఆత్మలతో జీవనం కొరకు నిరంతరం కృషి చేయాలని తీర్మానించారు.
నిరుద్యోగ యువత యువకులను అంబేద్కర్ ఆలోచన విధానానికి కార్యనిర్ముఖలను చేయాలని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఆయా వర్గాల వరకే ఖర్చు చేయాలని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలును ఆ వర్గాల వారికే పొందే విధంగా వారికి అవగాహన కల్పించాలని తీర్మానించారు.
అంబేద్కర్ ఆలోచన విధానాలను పల్లె పల్లెకు తీసుకొని వెళ్లాలని అలాగే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ ప్రతివారం గ్రీవెన్స్ నిర్వహించి దళిత ఆదివాసి వర్గాల వారి సమస్యలను తెలుసుకొని ప్రతి సోమవారము జిల్లా కలెక్టర్ నిర్వహిస్తున్న జిల్లా గ్రీవెన్స్ లో జిల్లా అధికారులతో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీ ఎస్టీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాలు లేనందున వాటిని సాధించేటందుకు గౌరవ వివిధ పార్టీల రాజకీయ పెద్దలను జిల్లా అధికారులను కలిసి వినతి పత్రం అందజేసి ముఖ్యమంత్రి దృష్టికి ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడానికి కృషి చేయాలని తీర్మానించారు. అట్రాసిటీ కేసులు పై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించే విధంగా జిల్లా యంత్రాంగాన్ని కలిసి చర్చించాలని, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు నియామకాలు కల్పించాలని ఎస్సీ ఎస్టి కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ పథకాలు అమలు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు జీవనోపాధి కల్పించాలని కోరారు.
జిల్లాలో ఉన్న భూ తగాదాలను పరిష్కరించాలని అన్ని దళిత సంఘాలతో జిల్లా యంత్రాంగం సమావేశం ఏర్పాటు చేయాలని పలు అంశాలను తీర్మానం చేశారు. త్వరలో కొత్త జేఏసీ కమిటీ ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని సంఘ సభ్యులు తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సంఘ ప్రతినిధులు పోతల దుర్గారావు అంపోలు ప్రతాప్ ఎస్సీ ఎస్టీ న్యాయవాద సంఘ ప్రతినిధులు మరియు ఎస్సీ ఎస్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు గంజి ఎజ్రా ఎస్సీ ఎస్టీ మోనిటరింగ్ కమిటీ సభ్యులు తోట రాము దండాసి రాంబాబు( జాన్ ) దళిత మహాసభ సంఘ ప్రతినిధులు దత్తి గోవిందరావు రెల్లి కులం సంక్షేమ సంఘ ప్రతినిధులు అర్జి కోటి బెవర రాము సుధాకర్
మాదిగ దండోరా సంఘ ప్రతినిధులు ఎస్సీ ఎస్టీ మోనటరింగ్ కమిటీ సభ్యులు తిరుమల రావు మరియు నారాయణరావు ఆదివాసి సంఘ ప్రతినిధులు ఆవాల అప్పన్న బహుజన టీచర్స్ యూనియన్ ప్రతినిధులు సిర రమేష్ బాబు దళిత హక్కుల పరిరక్షణ సమితి సంఘ ప్రతినిధులు నివర్తి శ్యాము సుందర్ బసవల చిన్నారావు భైరి ధనరాజ్ రుప్ప అప్పలనాయుడు
ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ సంఘ ప్రతినిధులు కొప్పల డేనియల్ భూపతి రవికుమార్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు రావాడ వెంకట్రావు లక్ష్మణరావు అర్జీ ఈశ్వరరావు త్రినాధ్ రామారావు తారక్ మొదలగువారు సమావేశానికి హాజరయ్యారు.
