విశాఖపట్నంహోమ్

శ్రీలంక తీరంలో ఇరాన్‌ యుద్ధనౌకపై దాడి: 100 మంది మృతి?

#IranWarShip

శ్రీలంక తీర ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన ఓ నౌకపై సబ్‌మరైన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో కనీసం 101 మంది గల్లంతయ్యారని, ఒకరు మృతి చెందగా 78 మంది గాయపడ్డారని శ్రీలంక నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. దాడి ఎవరు నిర్వహించారన్నది స్పష్టంగా తెలియరాలేదు. దాడికి గురైన ఆ నౌక సముద్రంలో మునిగిపోయింది.

ఈ నౌక ఇటీవలే భారతదేశంలో ని విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ నావికా వ్యాయామం ఎక్సర్ సైజ్ మిలన్ కార్యక్రమం లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మరోవైపు శ్రీలంక  విదేశాంగ మంత్రి పార్లమెంట్‌లో మాట్లాడుతూ, ఉదయం 6 గంటలకు (1230 GMT) ఆ నౌక నుంచి అత్యవసర సహాయ సంకేతం అందిందని, వెంటనే నౌకాదళం రక్షణ చర్యలు ప్రారంభించిందని వెల్లడించారు.

పేరు వెల్లడించేందుకు నిరాకరించిన ఒక నౌకాదళ అధికారి చెప్పిన మాటల ప్రకారం, “ఇప్పటివరకు 79 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించాం. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 101 మంది గల్లంతైనట్లు భావిస్తున్నాం. నౌక పూర్తిగా మునిగిపోయింది” అని తెలిపారు. ఆసుపత్రికి తరలించిన వారిలో ఒకరు మృతి చెందినట్లు వర్గాలు వెల్లడించాయి.

ఇరాన్ నావికాదళానికి చెందిన IRIS Dena అనే యుద్ధ నౌక గా దీన్ని గుర్తించారు. శ్రీలంక నావికాదళం, వాయుసేన వెంటనే రక్షణ కార్యకలాపాలు ప్రారంభించి, ఇప్పటివరకు 30-32 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని వెతుకుతున్నారు.

Related posts

ఇస్లామాబాద్ అష్ట దిగ్బంధనం: చర్చలు ఎప్పుడో….

Satyam News

తమ్ముడు అకౌంట్‌ నుండి జగన్‌కి…. పీఏ పట్టించేశాడు…!!

Satyam News

‘ఆత్మరక్షణ’ పేరుతో మళ్లీ అమెరికా దాడులు

Satyam News

కాక్ రోజ్ జనతా పార్టీ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ హ్యాక్?

Satyam News

పార్టీ పెడతానంటే కారు కూతలు కూస్తున్న బీ ఆర్ ఎస్ నేతలు

Satyam News

మరిడి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ

Satyam News

Leave a Comment