ముఖ్యంశాలుహోమ్

తెలంగాణ జాతిపిత రావి నారాయణ రెడ్డి

CPINarayana

మానుకోటలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార ర్యాలీలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ అసలైన సమస్యలను పక్కన పెట్టి, అనవసరమైన అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మహాత్మా గాంధీ దేశానికి జాతిపిత అనే విషయంలో ఎలాంటి సందేహం లేదని, అయితే తెలంగాణ విషయానికి వస్తే సాయుధ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి మాత్రమే తెలంగాణ జాతిపిత అని ఆయన స్పష్టం చేశారు. నాడు జవహర్‌లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ ఓట్లు సాధించిన ఘనత రావి నారాయణ రెడ్డిదేనని గుర్తు చేశారు.

ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ‘పేటెంట్ రైట్’ మాత్రం ఖచ్చితంగా కేసీఆర్‌కే దక్కుతుందని నారాయణ అభిప్రాయపడ్డారు.
ఇదే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్‌పై నారాయణ తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు గుప్పించారు.

సుమారు 60 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, అప్పుడే 5 శాతం కమిషన్లు వసూలు చేసినట్లు సమాచారం ఉందని ఆరోపించారు. “అలులేదు చూలులేదు కొడుకు పేరు సోమలింగం” అన్న చందంగా, కనీసం మున్సిపల్ ఎన్నికలే పూర్తి కాకముందే, గెలుపోటములు తేలకముందే అవినీతికి తెరలేపడం దారుణమన్నారు.

ఫలితాలు రాకముందే అవినీతి కూతలు కూయడం ఎమ్మెల్యే పనితీరుకు నిదర్శనమని ఆయన విమర్శించారు.

Related posts

ఇమ్రాన్ ఖాన్ మృతిపై సంచలన పుకార్లు?

Satyam News

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు ప్రమాణం

Satyam News

జగన్ హత్య కేసులో లొంగిపోయిన తమీమ్

Satyam News

మంత్రి కొండా సురేఖను కలిసిన శైలజా రామయ్యర్

Satyam News

ప్రకృతి వ్యవసాయ నమూనాలకు నెదర్లాండ్స్ ప్రశంసలు

Satyam News

తన పర్సనల్ అసిస్టెంట్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించిన వినోద్ కుమార్

Satyam News

Leave a Comment