ప్రత్యేకంహోమ్

ఇక టార్గెట్ టెహరాన్: యుద్ధం తీవ్రతరం

#Tehran

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి యుద్ధం ఐదో రోజుకు చేరుకున్నంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇరాన్ రాజధాని టెహరాన్ లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామునే ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన ప్రకారం, ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులను అడ్డుకునేందుకు తమ వైమానిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశామని, జరూసలేం పరిసర ప్రాంతాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని వెల్లడించింది.

ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ హెడ్ క్వార్టర్స్ పైనా నేరుగా భద్రతా దళాలపైనా దాడులు కొనసాగిస్తుండగా, ఇస్లామిక్ రిపబ్లిక్ క్షిపణులు, డ్రోన్ దాడులతో ఇజ్రాయెల్‌తో పాటు ప్రాంతంలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటోంది. మంగళవారం సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయం, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాలపై డ్రోన్ దాడులు జరిగాయి.

ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ అత్యవసరం కాని సిబ్బందిని అక్కడి నుంచి తరలించేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇరాన్ ఇప్పటి వరకు 500కు పైగా బాలిస్టిక్ క్షిపణులు, 2,000కుపైగా డ్రోన్లు ప్రయోగించింది.

యుద్ధం ప్రారంభ గంటల్లో అమెరికా చేపట్టిన దాడులు 2003లో అమెరికా నేతృత్వంలోని ఇరాక్ ఆక్రమణ సమయంలో జరిగిన తొలి దాడుల కంటే దాదాపు రెండింతలు తీవ్రంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. “ఇప్పటికే దాదాపు 2,000 లక్ష్యాలపై దాడులు జరిపాం. 2,000కుపైగా ఆయుధాలను వినియోగించాం. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాం. వందలాది క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లను ధ్వంసం చేశాం,” అని కూపర్ ఒక వీడియో సందేశంలో తెలిపారు.

“సాదాసీదాగా చెప్పాలంటే, మాపై దాడి చేయగల సామర్థ్యం ఉన్న ప్రతిదానిని నిర్వీర్యం చేయడమే మా లక్ష్యం,” అని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం నెలరోజులు లేదా అంతకంటే ఎక్కువ కొనసాగవచ్చని సూచించిన నేపథ్యంలో, ఐదు రోజుల్లోనే ఇరాన్‌లో సుమారు 800 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ప్రకారం, అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 787 మంది మరణించారు.

కువైట్ లో శత్రు వైమానిక లక్ష్యాలను అడ్డుకుంటున్న సమయంలో పడి వచ్చిన శకలాల వల్ల 11 ఏళ్ల బాలిక మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ముగ్గురు, బెహరెయిన్ లో ఒకరు మరణించినట్లు వెల్లడించారు.

ఆదివారం పోర్టు షుయేబా లోని కమాండ్ సెంటర్‌పై జరిగిన డ్రోన్ దాడిలో ఆరుగురు అమెరికా ఆర్మీ రిజర్వ్ సైనికులు మృతి చెందినట్లు సమాచారం. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.

Related posts

మంత్రి కొండా సురేఖను కలిసిన శైలజా రామయ్యర్

Satyam News

రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం

Satyam News

శాస్త్రోక్తంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి తిరుమంజనం

Satyam News

వాటర్ డైవర్షన్ ను అధికారులు అడ్డుకోవాలి

Satyam News

శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో భక్తుల పూజలు

Satyam News

పాండురంగడి సేవలో తరించిన భక్త జనాబాయి

Satyam News

Leave a Comment