25.2 C
Hyderabad
September 20, 2026
మహబూబ్ నగర్హోమ్

గద్వాల పట్టణంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి

#Gadwal

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం ఎమ్మార్పీఎస్, మాల మహానాడు సంఘాల  ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలో దళిత సంఘాల ఐక్యవేదిక కార్యాలయం దగ్గర సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే ఆమె భర్త జ్యోతిబాపూలే సామాజిక సేవలో పాల్గొంటూ చిన్నతనములోనే ఈ భారతదేశం లో మొట్టమొదటి చదువుల తల్లిగా కొనియాడబడిందని తెలిపారు. ఆ కాలంలోనే స్త్రీలకు విద్య లేదని మనువాదులు విద్యకు దూరం ఉంచిన సమయంలో తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో చదువుకున్నారని తెలిపారు.

దేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి విద్య లేని మహిళలకు విద్యను బోధిస్తూ వారికి సమాజంలో ఉన్న రుగ్మతలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిన సామాజిక సేవకురాలు సావిత్రిబాయి అని వక్తలు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కుంకల భీమన్న, మాల మహానాడు రాష్ట్ర నాయకులు మాల శ్రీనివాసులు, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు అశోక్ మాదిగ, ఐజ ఆంజనేయులు మాదిగ, డ్యాం హనుమంతు, మేస్త్రి కృష్ణ, కాలేజీ విద్యార్థినిలు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Related posts

వరుసగా 9 వ సారి బడ్జెట్: నిర్మల రికార్డు

Satyam News

కాంక్రీట్ జంగిల్ మధ్య ‘గ్రీన్ లంగ్స్’గా నగర వనాలు

Satyam News

అధికారుల అలసత్వం..కాలనీ ప్రజల ఆగ్రహం!

Satyam News

కాల్పులు చూసి నేను భయపడలేదు: ట్రంప్

Satyam News

ఎన్ ఆర్ ఐలు పర్యాటక ప్రాంతాలను దత్తత తీసుకోవాలి

Satyam News

8 వారాలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి…

Satyam News

Leave a Comment