సినిమాహోమ్

‘లేచింది మహిళాలోకం’ సినిమా ట్రైలర్ లాంచ్

#AnanyaNagella

బృహస్పతి ఎంటర్‌టైన్‌మెంట్స్, అప్పారెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘లేచింది మహిళాలోకం’. దర్శకద్వయం అర్జున్-కార్తిక్ రూపొందించిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి, శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలు పోషించారు.

కొత్తగా పెళ్లయిన ఒక జంట మధ్య చిన్న చిన్న విషయాలకే విబేధాలు రావడం.. వాటికి ఆజ్యం పోసేలా పక్కింటివాళ్లు తమ మాటలతో పొల్యూట్ చేయడం.. ఈ క్రమంలో జరిగే పరిణామాలు ఒకవైపు థ్రిల్‌కు గురి చేస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న  ఈ చిత్రం మార్చి 26న థియేటరల్లో విడుదలకు సిద్ధమవుతోంది.

సన్‌స్టూడియో యూఎఫ్‌ఓతో కలిసి ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సోమవారం ప్రసాద్ ల్యాబ్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇండస్ట్రీ మాకు కొత్త. ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నుంచి వచ్చాం. మొదటి ప్రయత్నంలోనే ఇంత మంచి సినిమా తీశాం.

అందరూ మా సినిమాని థియేటర్స్‌లో చూసి ఆశీర్వదిస్తే ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాం’’ అని అన్నారు. డైరెక్టర్ అర్జున్ మాట్లాడుతూ.. ‘‘యాక్టర్స్ అందరి డెడికేషన్ వల్లే సినిమా అనుకున్న విధంగా వచ్చింది. మా మహిళామణులు అందరూ ఎంతో చక్కగా మాకు సహకరించారు. డీవోపీ కూడా చాలా సహకరించారు. అందుకే సినిమా అవుట్ పుట్ ఇంత బాగా వచ్చింది.

ఇది పూర్తిగా ఫన్ మూవీ అందరికీ నచ్చుతుంది. అందరూ తప్పకుండా చూడండి’’ అని తెలిపారు. మరో డైరెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘ఇది ఫన్ రైడింగ్ ఫిల్మ్. ఆర్టిస్ట్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. ట్రైలర్ చూశారు కదా.. అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ సినిమాను థియేటర్లలో అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. మార్చి 26న అందరూ తప్పకుండా చూడండి’’ అని చెప్పారు.

ఏపీ, తెలంగాణ యూఎఫ్‌ఓ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ మాట్లాడుతూ..  ‘‘సినిమా చూశాను. చాలా బాగుంది. ఇంత మంచి సినిమాను ప్రేక్షకుల దగ్గరికి ఎలాగైనా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా. అందుకే రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చా. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అందరూ తప్పకుండా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నా’’ అన్నారు.

ఫస్ట్ టైమ్ ఒక కామెడీ రోల్ చేశా: అనన్య నాగళ్ల

హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఒక మంచి కామెడీ ఫిల్మ్‌తో మీ ముందుకు వస్తున్నాం. కామెడీ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. మా సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. నేను ఇప్పటి వరకు సీరియస్ రోల్స్ చేశా. ఫస్ట్ టైమ్ ఫుల్ కామెడీ మూవీ చేశా. అందరూ తప్పకుండా మా సినిమాను మార్చి 26న థియేటర్లలో చూసి బాగా ఎంజాయ్ చేయండి’’ అని తెలిపారు.

సింగర్, యాక్టర్ శ్రీరామ చంద్ర మాట్లాడుతూ.. ‘‘మహిళలందరికి ఉమేన్స్ డే శుభాకాంక్షలు. నేను, అనన్య ఇందులో జంటగా చేశాం. మా పెయిర్ బాగా వర్కవుట్ అయిందని అనుకుంటున్నాం. ఆడవాళ్లకు బంగారం, వెండి కొనడం కాదు.. అమ్మాయిలను బంగారంగా చూసుకుంటే అదే చాలు. అందరికీ రిలేటె అయ్యే స్టోరీ ఇది. అందరికీ సినిమా బాగా నచ్చుతుంది.

నన్ను ఇందులో కొంచెం డిఫరెంట్‌గా చూస్తారు. సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘‘మేము చిన్న చినిమా చేసినా.. అద్భుతమైన సినిమా చేశాం. నేను కామెడీ విషయంలో రెచ్చిపోయి చేశా. ఫ్లోలో చాలా మార్పులు చేశాం. సినిమాను సినిమాగానే చూడండి. సీరియస్ సబ్జెక్టును కామెడీగా చెప్తేనే వింటాం.

ఆడవాళ్లు అందరూ చూస్తే చాలు. నిర్మాతలకు పెట్టిన డబ్బుల కంటే రెట్టింపు రావాలని కోరుకుంటున్నా. ఇంత మంచి మహిళలతో కలిసి సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రమోషన్స్‌లో చూపించిన బ్లూ డ్రమ్‌కు మా సినిమాకు సంబంధం ఉండదు.  ‘లేచింది మహిళాలోకం’ మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు.. అందరినీ నవ్వించే చిత్రం. మార్చి 26న అందరూ తప్పకుండా చూడండి.’’ అని చెప్పారు.

Related posts

మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్‌ మెట్రో

Satyam News

సాగునీటి సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ

Satyam News

ఇరాన్ దిశగా అమెరికా నౌకాదళ ‘ఆర్మాడా’

Satyam News

దువ్వాడ, అనంతబాబు రీఎంట్రీ…. జగన్‌ యూటర్న్..??

Satyam News

గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి దర్శనం కు మార్గం సుగమం

Satyam News

తిరగబడ్డ ఒరిస్సా బస్సు

Satyam News

Leave a Comment