ముఖ్యంశాలుహోమ్

సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని తప్పుగా ప్రచారం చేస్తున్న వైసీపీ

#courtordercase

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో కేసు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కూడా వైసీపీ అనుబంధ మీడియా వక్రీకరిస్తూ ప్రచారానికి పాల్పడుతున్నది. తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సరికొత్త “డ్రామా” నడిపిస్తున్నది.

వీడియోలో చీఫ్ జస్టిస్ స్పష్టంగా “మీ పిటిషన్‌ను మేము విచారించలేము, డిస్మిస్డ్ ” అని చెప్పి సాగనంపితే, ‘నీలి మీడియా’ మేధావులు మాత్రం దానికి సొంతంగా స్క్రిప్ట్ రాసుకుని ప్రచారం చేస్తున్నారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలు చెప్పేవారి గొంతు నొక్కడానికి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్న చరిత్ర మనకు తెలుసు.

ఇప్పుడు తిరుమల లడ్డూ విషయంలో తను చేసిన తప్పులు బయటపడుతుంటే, ప్రజల నోళ్లు మూయించడానికి తన మిత్రుడు సుబ్రహ్మణ్య స్వామిని అడ్డం పెట్టుకుని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. తాజాగా ఆయన అనుచరుడి ద్వారా వెళ్లినా.. మళ్ళీ కోర్టు మొట్టికాయలు వేసింది. పరువు పోయినా జగన్ కి అవేమీ కొత్త కాదు.

ఎన్ని చీవాట్లు తిన్నా మళ్ళీ అదే పంథా అనుసరించడం ఆయనకే చెల్లింది. కానీ వైకాపా ఫేక్ రోతలకు తగ్గట్లుగా కొన్ని బులుగు మీడియాలు కూడా విషయం తెలుసుకోకుండా వాస్తవాలను వక్రీకరించి రాశాయి. రాజ్యాంగంలోని 32వ అధికరణం కింద దాఖలు చేసిన ఈ పిటిషన్, కేవలం ఒక క్రిమినల్ కేసులో నిందితుల తరపున డిఫెన్స్‌ను బలపరుచుకోవడానికి చేసిన ప్రయత్నంగా కోర్టు భావించింది.

అందుకే జగన్ అనుచరులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణ కొనసాగుతున్న తరుణంలో, ఎవరైనా తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను నేరుగా సీబీఐకి అందజేయవచ్చని, తద్వారా విచారణ తార్కిక ముగింపుకు వస్తుందని కోర్టు సూచించింది. వైసీపీ ప్రచారం చేస్తున్నట్లుగా కోర్టు ఎక్కడా “మీరు నిపుణులా?” అని ప్రశ్నించలేదు.

అసలు కోర్టు అడిగింది ఏంటంటే “ఆల్రెడీ సీబీఐ ఎంక్వైరీ జరుగుతోంది కదా.. రాజ్యాంగంలోని 32వ అధికరణం కింద దాఖలు చేసిన ఈ పిటిషన్, కేవలం ఒక క్రిమినల్ కేసులో నిందితుల తరపున డిఫెన్స్‌ను బలపరుచుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వెళ్లి సీబీఐకి ఇచ్చుకోండి” అని.

పిటిషనర్ గొంతు పెంచి “నా కోసం ఫలానా పేజీ చూడండి” అని అడిగితే.. అది చూసి, నేరుగా నోరు మూయ్ అని చెప్పకుండా “థాంక్స్” అని సుప్రీం కోర్టు సున్నితంగా చెప్పి పంపించేసింది. కానీ, వైసీపీ మాత్రం దాన్ని కూడా కల్తీ చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా పిటిషన్ కొట్టేస్తే మొహం చాటేసుకుంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, కోర్టు మొట్టికాయలు వేసి పంపించేస్తే “చూశారా! కోర్టు మా గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో” అని డప్పులు కొట్టుకుంటున్నారు.

ఇది ఎలా ఉందంటే, పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి.. “మేడం నన్ను క్లాస్ నుంచి బయటికి పంపారు కాబట్టి, నాకు చదువు బాగా వచ్చని మేడం నమ్మకం” అని ఇంట్లో చెప్పుకున్నట్టు ఉంది. కోర్టులో చెప్పని డైలాగులను కూడా జస్టిస్ ల నోటికి తగిలించే వీరి క్రియేటివిటీ చూస్తుంటే, ఆస్కార్ లెవల్ రైటర్లు కూడా తలదించుకోవాల్సిందే.

లడ్డూలో కల్తీ నిజం.. వీళ్ల వార్తల్లో కల్తీ అంతకన్నా నిజం. తిరుమల ప్రసాదం పవిత్రతను దెబ్బతీసిన నెయ్యి కల్తీ వ్యవహారం కంటే, ఈ ‘ఫేక్ మీడియా’ వండి వడ్డిస్తున్న వార్తల కల్తీ ఇంకా ప్రమాదకరంగా ఉంది. న్యాయస్థానం పిటిషన్‌ను చెత్తబుట్టలో వేస్తే, దాన్ని కిరీటంలా భావించి ఊరేగుతున్న వైనం చూస్తుంటే ప్రజలకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కానీ, ఇక్కడ నిజం కళ్ళముందే ఉన్నా.. ‘అబద్ధాన్ని’ అందంగా అలంకరించి అమ్మడంలో వీరు సిద్ధహస్తులు.

Related posts

బీచుపల్లిలో రేపు శ్రీ సీతారాముల కళ్యాణం

Satyam News

అయోధ్య నిధుల చోరీ కేసులో ఇద్దరు ఔట్

Satyam News

గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి దర్శనం కు మార్గం సుగమం

Satyam News

విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించేలా ప్రణాళికలు

Satyam News

వేసవిలో నీటి ఎద్దడి రానీయకుండా చెరువులు నింపాలి

Satyam News

రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా కృషి: లింగమనేని రమేష్

Satyam News

Leave a Comment