వనపర్తి జిల్లా పెబ్బేరు సంత వివాదం దేవాదాయ శాఖకు పూజారులకు మధ్య నడుస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు. కోర్టును గౌరవిస్తూ ఎవరికి అన్యాయం చేయకూడద న్న ఆలోచనతోనే ముందుకెళ్తున్నామన్నారు.
1973 లో ఒక ప్రొసీడింగ్ వచ్చిందని 392 సర్వే నెంబర్లు 15 ఎకరాలు, సర్వేనెంబర్ 405 లో 15 ఎకరాల భూమి మొత్తం 30 ఎకరాల 19 గుంటలు వేణుగోపాల స్వామి దేవుడిపై ఆయన దూపదీప నైవేద్యాల కోసం కేటాయించబడిందన్నారు.
ఆ గుడి ద్వారా వచ్చే ఆదాయంతో పూజారులు వాళ్ళ జీవనాన్ని కొనసాగించేందుకు కేటాయించారని చెప్పారు. తదంతరం వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించిన రిజిస్టర్లలోని కాస్ర, పహానిలో దేవుడు వేణుగోపాల స్వామిని మనిషి వేణు గోపాలస్వామిగా చిత్రీకరించి రాశారని అది చేసిన ఎవరు చేసిండ్రు ప్రజలకు అర్థమై పోతుందన్నారు.
ఈ భూమికి సంబంధించి మహబూబ్నగర్, గద్వాల ఆర్డివోలు సైతం ఈ భూమి పూర్తిగా వేముల గోపాల స్వామి ఆలయానికి సంబంధించిందని సూచిస్తూ ప్రభుత్వా పరమైన ప్రోసిడింగ్ ఇవ్వడం జరిగిందన్నారు.
100 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న పెబ్బేరు సంతస్థలం ఈ గంజాయి మొక్క ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ పదవి రాగానే వివాదాస్పదంగా మార్చారని ఆయన విమర్శించారు. ఈయన అధికారంలో ఉన్న సమయంలోనే వారసులొచ్చారు, దేవదాయ శాఖకు సరెండర్ చేస్తారు ఇంకోటి ఇంకోటి వాళ్ళ ఇష్టానుసారంగా చేసిన విషయాలన్నీ పెబ్బేరు ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.
ఆలయ పూజారుల అడ్వకేటునైన నేనే ఈ సమస్యను పరిష్కరిస్తానని 12 నుంచి 15 ఎకరాలలో సంతకు సరిపోతుందని మిగతాది పూజారుల పేరు మీద చేద్దామని ఒక ప్లాన్ ప్రకారంగా ఆ స్థలాన్ని దొబ్బేసేందుకు వ్యూహాలు రచించారన్నారు.
ఈ క్రమంలో గిఫ్ట్ డిడి కింద రిజిస్ట్రేషన్ చేసేది ఉంటే అది పెబ్బేరు మున్సిపల్ పేరున చేయాల్సి ఉంటుందని, కానీ ఆయన అలా చేయలేదని, మళ్లీ నేనే గెలుస్తానని, అప్పుడు ఈ స్థలాన్ని దొబ్బియొచ్చని పెబ్బేరు ఎమ్మార్వో పై రిజిస్ట్రేషన్ చేయించారు.
అయితే అప్పటికే పదవిలో ఉన్న ఆయన ఏడు నెలలు తన పదవీకాలం ఉన్న రాష్ట్రంలోనే నెంబర్ ఫోర్ అనీ చెప్పుకునే తనకి వారికి ఆల్టర్నేట్ ల్యాండ్ చూయించేందుకు సమయం లేకపోవడం విడ్డూరం, అట్లా చెయ్యకపోగా కలెక్టర్ స్థాయి ఉన్నతాధికారులపై పెత్తనంచేలాయించి ఆపించిందే కాక రాత్రికి రాత్రి కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేసిన ఘనత ఈ ప్రబుద్ధుడిదని ఆయన ఎద్దేవా చేశారు.
తమకు అనుకూలంగా ఉన్న అధికారులకు అడిషనల్ కలెక్టర్ గా పదవులను కట్టబెట్టి వీరు స్థలానికి సంబంధించిన ప్రోసిడింగులు పొందారని, అందుకు సంబంధించిన ఈవిడెన్సులన్నీ మన దగ్గర ఉన్నాయని ఎమ్మెల్యే చెప్పారు. సంత స్థలానికి సంబంధించి 30 సంవత్సరాల నుండి దేవదాయ శాఖ కోర్టును ఆశ్రయించిందని ఇంకా దేవదాయ శాఖకు మధ్యల ఇందుకు సంబంధించిన సమస్య కొనసాగుతూనే ఉందని ఆయన అన్నారు.
నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2024 లో సంత స్థలం సంతకు కెటాయించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి లెటర్ రాశారని ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి కూడా జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసి ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మెసేజ్లు పెట్టలేదని తడి బట్టలతో వేణుగోపాల స్వామి గుడిలోకి వచ్చి ప్రమాణం చేయాలని నేనైనా వస్తానని ఎమ్మెల్యే సవాలు విసిరారు. వారు రాసిన లెటర్ ఆధారంగానే దాన్ని బేస్ చేసుకుని నేను నా లెటర్ ఐడి పై అదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినట్టు ఎమ్మెల్యే చెప్పారు ప్రస్తుతం ఉన్న కలెక్టర్ పెబ్బేరు పరిధిలో ఎక్కడైనా స్థలం చూసి గిఫ్ట్ డిడికి తగ్గట్టుగా ల్యాండ్ కేటాయించడానికి చూస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.
మిగతా స్థలానికి సంబంధించిన విలువ 22 కోట్ల రూపాయలను ప్రభుత్వం తరఫున వస్తే అది ఎవరికీ ఇవ్వాలని మరో సందిగ్గం నెలకొన్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. కోర్టులో ఉన్న వ్యాజ్యం పరిష్కారమైన తర్వాత ఎవరికి స్థలం వస్తే వారికి అమౌంట్ అందజేద్దామని చెప్పినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెబ్బేరు సంత పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో నడుస్తోందని చిట్టచివరి వరకు అంతస్థలం పెబ్బేరు సంతకే దక్కేల చూస్తామని ఆయన అన్నారు.
కరీవేన రిజర్వాయర్ ఏర్పాటులో ల్యాండ్ కోల్పోయిన రైతులకు ఇక్కడ 20 ఎకరాలు అప్పనంగా నాయకుడు నువ్వు కాదా అని ఆయన ప్రశ్నించారు. నీ బినామీల పేరున ఉన్న 20 ఎకరాల భూమిని తిరిగి తీసుకోవాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.
ఎప్పటినుంచో అక్కడ సాగులో ఉన్న రైతులను మెడబట్టి బయటికి గెంటేసి బినామీలకు ఎట్లా అమ్మావు ఆ స్థలాన్ని అది వాపస్ తీసుకురా అక్కడే మెడికల్ కాలేజ్ కడదామని ఆయన సవాల్ చేశారు. మినీ ట్యాంకుల పేరు మీద బిల్లులు దొబ్బిన రండ ఎవరు బయటికి రావాలన్నారు.
కృష్ణానదిలో స్థలం కబ్జా చేసిన కబ్జాకోరు ఎవరో చెప్పాలి రెండు ఎకరాలు అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్టుకున్న దరిద్రుడు నువ్వు నీతులు పలకడం సిగ్గుచేటని ఎమ్మెల్యే చెప్పారు. దత్తపుత్రుడు పేరుపై రాయితీలు దొబ్బిన సన్నాసి ఎవరన్నారు.
వీరాయపల్లిలో వేరుశనగ పరిశోధన కోసం పని చేస్తే బిల్లులు దొబ్బితున్నది నువ్వు కాదా అని ఎమ్మెల్యే విమర్శించారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్
