26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

మాట నిలబెట్టుకున్న లోకేష్…. పేద ముస్లిం ఫ్యామిలీకి రంజాన్‌ కానుక…!!

#NaraLokesh

ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు మంత్రి నారా లోకేష్. గతేడాది రంజాన్ మాసంలో ఓ పేద ముస్లిం మైనార్టీ సోదరుడికి ఇచ్చిన మాటను, ఏడాది తిరగకముందే నెరవేర్చి గొప్ప మనసు చాటుకున్నారు. నేను ఉన్నాను..నేను చూసుకుంటాను అంటూ నాడు లోకేష్ ఇచ్చిన హామీ, ఇవాళ ఒక అందమైన ఇల్లుగా మారి ఆ పేద కుటుంబంలో వెలుగులు నింపింది.

గతేడాది రంజాన్ సమయంలో ఒక పేద ముస్లిం మైనార్టీ సోదరుడి నివాసానికి వెళ్ళిన లోకేష్, అక్కడ వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులను, వారి నివాస పరిస్థితిని చూసి లోకేష్‌ చలించారు. ఆ కుటుంబ బాధ్యతను తానే తీసుకుంటానని, వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.

సాధారణంగా రాజకీయాల్లో హామీలు ఇచ్చి మరిచిపోవడం చూస్తుంటాం. కానీ లోకేష్ మాత్రం నిరంతరం ఆ ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ, ఏడాది తిరగకముందే ఆ పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేశారు. సకల సౌకర్యాలతో నిర్మించిన ఆ ఇంటిని చూసి ఆ ముస్లిం కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ పండుగ వేళ తమకు ఇంతటి గొప్ప బహుమతిని అందించిన మంత్రి లోకేష్‌కు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

మాట ఇస్తే వెనక్కి తగ్గని నైజం లోకేష్‌ది అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, కష్టాల్లో ఉన్న సామాన్యుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ధ్యేయంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ముస్లిం మైనార్టీల పట్ల లోకేష్‌కు ఉన్న గౌరవం, ఆత్మీయతకు ఈ ఇల్లు ఒక నిదర్శనంగా నిలిచింది.

Related posts

17 నుండి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు

Satyam News

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం పై దాడి

Satyam News

అల్మాస్ పేట్ అల్లర్లకు బాధ్యుడైన సీఐ పై బదిలీ వేటు

Satyam News

జగన్ సన్నిహితుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్

Satyam News

సింధు జలాల ఒప్పందం రద్దుతో కష్టాల్లో పాక్

Satyam News

వైమానిక సంస్థను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌

Satyam News

Leave a Comment