మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యాలయంలో కూర్చుని నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు.
దోచుకున్న డబ్బుతో జల్సాలు చేసిన జగన్
నిన్న మొన్నటి వరకు “రాష్ట్రానికి మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ వస్తుంది? లోకేష్ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నాడు” అని వెటకారం చేసిన ఇదే జగన్ రెడ్డి.. ఇప్పుడు ఆ ప్లాంట్ తన పుణ్యమే అని క్రెడిట్ కొట్టేయాలని చూడటం ఆయన దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని విమర్శించారు.
నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నారా లోకేష్ గారు ఆదిత్య మిత్తల్ గారితో జూమ్ కాల్ మాట్లాడి ఒప్పించారని చెబితే.. ‘ఆదిత్య మిత్తల్ ఒడిశాలో లక్షల కోట్లు పెడుతున్నారు, ఆంధ్రాకు ఎందుకు వస్తారు?’ అని హేళన చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. తీరా ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి వల్ల మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగి పనులు మొదలయ్యేసరికి.. ఆ క్రెడిట్ నాదే అని ప్లేట్ ఫిరాయించి చంద్రబాబు, లోకేష్ క్రెడిట్ ని చోరి చేసే దుస్థితికి దిగజారాడాడు.
తన నేరాలు, దోపీడులు, ఎదుటి వాడికి అట్టగట్టి చెప్పిన అబద్దమే వందసార్లు చెప్పడం జగన్ నైజంగా ఉంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనే నినాదంతో ముందుకు వెళ్లింది. సెప్టెంబర్ 22, 2024న రాత్రి 8:30 గంటలకు లోకేష్ గారు స్వయంగా ఆదిత్య మిత్తల్ గారితో చర్చలు జరిపి, ప్రభుత్వ పారదర్శకతను వివరించి వారిని ఒప్పించారు.
ఆ వేగమే ఇవాళ రాష్ట్రానికి లక్ష కోట్లపైగా పెట్టుబడిని తెచ్చిపెట్టింది. జగన్ రెడ్డిలాగా మేం గాలిలో మాటలు చెప్పం. సాక్షాత్తూ లక్ష్మీ మిత్తల్ గారు, ఆదిత్య మిత్తల్ గారు వేదికపైనే చెప్పారు. చంద్రబాబు అనుభవం, లోకేష్ విజన్, పవన్ కళ్యాణ్ సహకారం చూసే మేం ఇక్కడ పెట్టుబడి పెడుతున్నామని. మరి దీనికి జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు?
జగన్ హయాంలో ఒక్క కంపెనీ అయినా రాష్ట్రానికి వచ్చిందా? ఉన్న కంపెనీలనే తరిమేసిన చరిత్ర మీది. ప్రభుత్వం కష్టపడి మొక్క నాటితే, అది వృక్షమై ఫలాలు ఇచ్చేటప్పుడు ‘నేనే నాటాను’ అని అబద్ధాలు ఆడటం జగన్ రెడ్డికి అలవాటే. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటో, పెట్టుబడులు ఎలా వస్తాయో లోకేష్ గారిని చూసి నేర్చుకోండి.
ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు, మీ అబద్ధాలను ఎవరూ నమ్మరని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత జగన్ రెడ్డికి లేదు. అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు చేసే కాలం చెల్లిపోయింది. ఇప్పటికైనా నిస్సిగ్గుగా మాటలు మార్చడం మానేసి, వాస్తవాలను అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పీహెచ్‌డీ చేశారు. 2022లో దావోస్‌లో ఆదిత్య మిత్తల్‌ను కలిశానని, తానే ఒప్పించానని ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. జగన్ గారూ.. గాలి మాటలు చెబితే నమ్మడానికి ఇది మీ సాక్షి ఆఫీస్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆధారాలతో మాట్లాడుకుందాం రండి అన్నారు.
రాష్ట్రానికి ఏ పెద్ద పెట్టుబడి రావాలన్నా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదం తప్పనిసరి. దానికి చైర్మన్ ముఖ్యమంత్రే ఉంటారు. జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో (2019-24) కేవలం 13 సార్లు మాత్రమే SIPB మీటింగ్ పెట్టారు. కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఈ రెండు ఏళ్లు కాకముందే.. అప్పుడే 15 సార్లు మీటింగ్ నిర్వహించి పెట్టుబడులను పరుగులు పెట్టిస్తున్నారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు
జగన్.. మీరు నిర్వహించిన ఆ 13 మీటింగ్‌లలో ఒక్కసారైనా ఆర్సెలార్ మిత్తల్ కంపెనీ గురించి చర్చించారా? పోనీ ఒక్క ప్రోటోకాల్ అయినా జరిగిందా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను.. వైసిపి నాయకులకు, వారి పేటీఎం బ్యాచ్‌లకు దమ్ముంటే ఆధారాలు చూపండి. మీ హయాంలో ఏ ఒక్క SIPB మీటింగ్‌లోనూ మిత్తల్ కంపెనీ ప్రస్తావనే లేదు.
మరి ఏ మొహం పెట్టుకుని ఇది నా క్రెడిట్ అని చెప్పుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక, 19-11-2024న జరిగిన SIPB మీటింగ్‌లో అజెండా నెం. 1 గా ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఆమోదం తెలిపారు. ఇదీ వాస్తవం! ఫేజ్-1, ఫేజ్-2 లలో కలిపి లక్షా 35 వేల కోట్ల భారీ పెట్టుబడికి మార్గం సుగమం చేసింది మా కూటమి ప్రభుత్వమే.
మా ప్రభుత్వం తెచ్చిన ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం పెట్టుబడి రూ. 1,35,964 కోట్లు రెండు దశల్లో, ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు సుమారు లక్ష పైగా ఉద్యోగాలు వస్తాయి. భూసేకరణ రెండు విడతల్లో సుమారు 6,000 ఎకరాల కేటాయింపు. నక్కపల్లిలో భూములు ఇచ్చానని జగన్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు. అయ్యా జగన్ రెడ్డి.. మీరు చేసింది శూన్యం, చెప్పేవి అన్నీ అబద్ధాలు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ‘సుజ్ స్పీడ్.. సుజ్ ఏపీ’ ట్యాగ్‌లైన్‌తో పని చేసి చూపిస్తున్నారు కాబట్టే ఇవాళ ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి వచ్చింది. ఇకనైనా మీ దొంగ క్రెడిట్ రాజకీయం ఆపండని విమర్శించారు.
మీ హయాంలో మీరు చేసిన పాపాల వల్ల రాష్ట్రం నుంచి కంపెనీలు పారిపోతే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులను మీ ఖాతాలో వేసుకోవాలని చూడటం మీ దిగజారుడుతనానికి నిదర్శనం. జగన్ గారూ.. 2022లో మీరు దావోస్‌లో కలిశానని చెబుతున్నారు కదా? మరి 2022 నుంచి 2024 వరకు మీరు నిర్వహించిన 8 SIPB (రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) మీటింగ్‌లలో ఒక్కసారి కూడా మిత్తల్ కంపెనీ ప్రపోజల్ ఎందుకు చర్చకు రాలేదు? దానికి ఆమోదం తెలుపుతూ ఒక్క జీవో (GO) అయినా ఎందుకు ఇవ్వలేకపోయారు?
ఎందుకంటే మీ ధ్యాస అంతా మద్యం, ఇసుక, మైనింగ్, గంజాయిలో వచ్చే ‘జే-టాక్స్’ కలెక్షన్ల మీద తప్ప, రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలనే ఆలోచన మీకు ఎప్పుడూ లేదు. లోకేష్ గారు 2024 సెప్టెంబర్ 22న ఆదిత్య మిత్తల్ గారితో మాట్లాడారు. అక్టోబరులో ఆ కంపెనీ నుంచి మూడు కీలక లేఖలు అందాయి. నవంబర్ 19న చంద్రబాబు గారు SIPB మీటింగ్ పెట్టి ఆమోద ముద్ర వేశారు.
కేవలం వారం రోజుల్లోనే, అంటే నవంబర్ 26, 2024న జీవో నెం. 76 విడుదల చేసి ప్లాంట్‌కు పచ్చజెండా ఊపారు. ఇదీ మా ప్రభుత్వ పనితీరు. కేవలం జీవో 76 మాత్రమే కాదు.. ఆ తర్వాత జీవో నెం. 5, 113, 96, 195 ఇలా వరుసగా సౌకర్యాలు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చాం కాబట్టే ఇవాళ మిత్తల్ స్టీల్ ప్లాంట్ సాకారమైంది. మీ జే-టాక్స్ వేధింపులు భరించలేక జాకీ, అమర రాజా, సింగపూర్ కన్సార్టియం వంటి పేరున్న కంపెనీలే రాష్ట్రం వదిలి పారిపోయాయి.
మీ సైకో తత్వాన్ని చూసి ఏ పారిశ్రామికవేత్త అయినా రాష్ట్రంలో అడుగుపెట్టే ధైర్యం చేశారా? షాపులు కట్టేసి మీకు దండం పెట్టి వెళ్ళిపోయారు. అలాంటిది ఇవాళ చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సహకారంతో లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తుంటే దొంగ క్రెడిట్ కోసం పాకులాడటం సిగ్గుచేటు. మీకు దక్కిన క్రెడిట్లు వేరే ఉన్నాయి జగన్ రెడ్డి ! సొంత తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చిన క్రెడిట్ మీది. సొంత చిన్నాన్నను గొడ్డలిపోటు పొడిపించిన క్రెడిట్ మీది. దమ్ముంటే 2019-24 మధ్య మీరు తెచ్చిన పెట్టుబడుల జాబితాను ఒక లేఖ ద్వారా విడుదల చేయండి.
తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని అబద్ధాల మీద అబద్ధాలు చెబితే నమ్మడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు జగన్ రెడ్డి గారూ. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి, జే-బ్రాండ్ల పేరుతో విషం తాగించి లక్షలాది మంది ఆడబిడ్డల మాంగల్యాలు తెంచిన క్రెడిట్ జగన్ రెడ్డిది. దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసిన క్రెడిట్, దళిత యువకుడికి గుండు గీయించిన అమానవీయ క్రెడిట్ మీది. జాకీ, లూలు, ఏషియన్ పల్ప్ వంటి దిగ్గజ సంస్థలను రాష్ట్రం నుంచి తరిమేసి, ‘బ్రాండ్ ఏపీ’ని సర్వనాశనం చేసిన చరిత్ర మీది.
స్వంత తల్లిని, చెల్లిని రోడ్డుపైకి లాగి, బాబాయ్ గొడ్డలిపోటు కేసులో దోషులను వెనకేసుకొచ్చిన ‘ఫ్యామిలీ క్రెడిట్’ కూడా మీదనని విమర్శించారు. మీరు దావోస్ వెళ్ళింది ప్రజల సొమ్ముతో ఫ్యామిలీ ట్రిప్పులు వేయడానికి, సూట్ కేస్ కంపెనీల్లో దోచుకున్నది దాచుకోవడానికి తప్ప, రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడి తేవడానికి కాదు. కానీ చంద్రబాబు, లోకేష్ ‘బ్రాండ్ ఏపీ’ ఇమేజ్‌ని మళ్ళీ నిలబెట్టారు. గూగుల్ నుంచి మిత్తల్ వరకు దిగ్గజ సంస్థలు క్యూ కడుతున్నాయి.
యువనేత నారా లోకేష్ చిన్న వయసులోనే తన అద్భుతమైన పనితీరుతో, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో ప్రపంచాన్ని ఆకర్షిస్తుంటే.. మీరు ఓర్వలేక ఏడుస్తున్నారు. పాదయాత్ర చేస్తారట.. ప్రజలు నవ్వుతున్నారు. మీరు వస్తే ప్రజలు ఏడుస్తూ ఉండాలి, ఆస్తులు తగలబడాలి, విధ్వంసం జరగాలి.. అదే కదా మీ సైకో మనస్తత్వం?
కానీ ఇప్పుడు రాష్ట్రం వెలిగిపోతోంది, రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. ఇవి మీకు నచ్చవు. ఇకనైనా చేయని పనికి క్రెడిట్ కావాలని ప్రాకులాడటం మానుకోండి. సోషల్ మీడియాలో గెంతులు వేస్తున్న మీ పేటీఎం కుక్కలకు, అబద్ధాలు ప్రచారం చేసే మీ బ్లూ మీడియాకు వీపు విమానం మోత మోగేలా సమాధానం చెబుతాం.
అబద్ధాల జగన్ రెడ్డి.. మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. క్రమశిక్షణతో మెలగడం నేర్చుకోండి, లేదంటే ప్రజలే మీకు సరైన బుద్ధి చెబుతారు అని అన్నారు.
