26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

సింహ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ సీతారామలక్ష్మణులు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహం బలానికి(వహనశక్తి), వేగానికి(శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సూపరింటెండెంట్ హ‌నుమంత‌య్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ న‌వీన్‌, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Related posts

తాడేపల్లిగూడెం లో డైమండ్ షో రూమ్ ప్రారంభం

Satyam News

పాకిస్తాన్ నుంచి యథేచ్ఛగా తుపాకుల స్మగ్లింగ్

Satyam News

మెటా అధిపతితో పాటు పలువురిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ కేసు

Satyam News

బీసీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ సభ్యులుగా సానా సతీష్

Satyam News

జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ సందేశం ఇదీ….

Satyam News

గల్ఫ్ దేశాల డేటా సెంటర్లను టార్గెట్ చేసిన ఇరాన్?

Satyam News

Leave a Comment