ప్రత్యేకంహోమ్

పాకిస్తాన్ నుంచి యథేచ్ఛగా తుపాకుల స్మగ్లింగ్

#Pakistan

పాకిస్తాన్ నుంచి పంజాబ్ రాష్ట్రంలోకి అక్రమంగా తుపాకుల స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈ విషయాన్ని నిఘా సంస్థలు ఆచూకీ కనుగొన్నాయి. పంజాబ్ రాష్ట్రంలో సరిహద్దు దాటించి అక్రమంగా తుపాకులు సరఫరా చేసే పద్ధతిలో కొత్త మార్పులు బయటపడడంతో భద్రతా సంస్థలు కూడా అత్యంత అప్రమత్తమయ్యాయి.

పాకిస్తాన్ నుంచి అక్రమంగా తరలిస్తున్న పిస్టళ్లపై ప్రత్యేక పేర్లు, కోడ్ సంఖ్యలు చెక్కిన ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. అమృతసర్ గ్రామీణ పోలీసులు ఇటీవల ఆధునిక సాంకేతికతతో తయారైన రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. వీటిపై “అవాన్ బాద్షా-222”, “భట్-007” వంటి గుర్తులు చెక్కి ఉన్నాయి.

భిండి సైదాన్ పోలీస్ స్టేషన్‌పై గ్రెనేడ్ దాడి కేసులో అరెస్టైన ఆరుగురు నిందితుల నుంచి ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో అమృతసర్ నగర పోలీసులు కూడా “భట్-007” అనే గుర్తుతో ఉన్న మరో పిస్టల్‌ను పట్టుకున్నారు. ఈ గుర్తులు యాదృచ్ఛికంగా కాకుండా ఉద్దేశపూర్వకంగా చెక్కబడినవని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

అక్రమ ఆయుధాల సరఫరాదారులు తమకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం, నెట్‌వర్క్‌లో తమ ప్రభావాన్ని చూపించడం కోసం ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని అనుమానం వ్యక్తమవుతోంది. అమృతసర్ గ్రామీణ ఎస్ఎస్పీ సోహైల్ ఖాసిం మీర్ ఈ పరిణామాన్ని తీవ్రమైన అంశంగా పేర్కొన్నారు. అక్రమ ఆయుధాల వ్యాపారంలో “బ్రాండింగ్” అనే కొత్త ధోరణి కనిపిస్తోందని ఆయన అన్నారు.

డ్రోన్ల ద్వారా తరలిస్తున్న తుపాకులు

ఈ గుర్తులు సరఫరా జరిగినట్లు సూచించే గుర్తులుగా, నెట్వర్క్‌లో నమ్మకాన్ని పెంచే సాధనంగా, అలాగే కొత్తగా చేరే వ్యక్తులపై మానసిక ప్రభావం చూపించే విధంగా ఉపయోగపడవచ్చని ఆయన వివరించారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఆయుధాలలో చాలా వరకు సరిహద్దు అవతల నుంచి డ్రోన్ల ద్వారా తరలిస్తున్నారు. డ్రోన్ ద్వారా సరఫరా చేయడం, అలాగే గుర్తులు చెక్కడం కలిసి చూస్తే ఇది సమన్వయంతో నడుస్తున్న పెద్ద స్థాయి నెట్వర్క్ పని అని భావిస్తున్నారు.

భిండి సైదాన్ గ్రెనేడ్ దాడి కేసులో అరెస్టైన నిందితుల విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. పాకిస్తాన్‌కు చెందిన గూఢచారి సంస్థలతో సంబంధం ఉన్న నిర్వాహకులు ఈ ఆయుధాలను పంపుతున్నట్లు వెల్లడైంది. స్థానిక నేర గుంపులకు సరఫరా చేయడం, లక్ష్యంగా చేసుకున్న దాడులకు వినియోగించడం కోసం ఈ తుపాకులు ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు.

ఇంకా గ్రామీణ ప్రాంతాలు, జైళ్లలో ఉన్న యువతను ఆకర్షించడానికి కూడా ఈ విధానం ఉపయోగపడుతుందనే అనుమానం భద్రతా సంస్థలకు ఉంది. సరిహద్దు అవతల నుంచి మద్దతు ఉందనే భావన కల్పించి వారిని నేర కార్యకలాపాల వైపు దారితీసే ప్రయత్నంగా దీనిని చూస్తున్నారు. ఇప్పటికే పలు నేర గుంపులను ఛేదించినప్పటికీ, ఇలాంటి కొత్త పద్ధతులు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోందని అమృతసర్ పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఈ గుర్తులను విశ్లేషించి ఆయుధాల సరఫరా మార్గాలను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నెట్వర్క్ వ్యాప్తి ఎంతవరకు ఉందో తెలుసుకుని, దాని వెనుక ఉన్న ముఠాలను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Related posts

ఆటో డ్రైవర్ల పట్ల చంద్రబాబుకు ఈ అకస్మాత్తు ప్రేమ ఎందుకు?

Satyam News

నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెట్టిన ‘కాక్రోచ్’ వ్యవస్థాపకుడు

Satyam News

కవాడీగూడాలో మహిళ దారుణ హత్య

Satyam News

విజయవంతంగా రెండో వారంలోకి ‘పోలీస్ కంప్లైంట్’

Satyam News

వైద్యుల నిర్లక్ష్యంతోనే మా బిడ్డ మృతి

Satyam News

కామెడీ పేరుతో వికలాంగుల్ని అవమానపరిచిన యూట్యూబర్లు

Satyam News

Leave a Comment