26.3 C
Hyderabad
September 19, 2026
ఆదిలాబాద్హోమ్

బాసర ఆలయ అభివృద్ధి పనులకు 6న శంకుస్థాపన

#BasaraTemple

బాసరలోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి జరగాలని చెప్పారు.

నిర్మల్ జిల్లా గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ప్రభుత్వం 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు వివరించగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. 6వ తేదీన ఈ ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సువిశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భక్తుల విశ్వాసాలు దెబ్బతినకుండా ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్  ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

మల్కాజ్ గిరి  స్టేషన్ లో  8 ఎక్స్ ప్రెస్ లు నిలిపేలా చర్యలు

Satyam News

బొత్సాకు హెరిటేజ్ లీగల్ నోటీసు

Satyam News

రాజంపేట టిడిపి బలోపేతానికి చర్యలు చేపట్టండి

Satyam News

మీ గెలుపు మాకు గర్వకారణం

Satyam News

భక్తులతో పోటెత్తిన మృత్యుంజయ కుంట

Satyam News

ఆరోపణలు ఉన్నా ఆగదు ప్రమోషన్

Satyam News

Leave a Comment