ఆధ్యాత్మికంహోమ్

భక్తులతో పోటెత్తిన మృత్యుంజయ కుంట

కడప నగరంలోని మృత్యుంజయ కుంటలో వెలసిన సర్వమంగళ దేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి అర్చకులు విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శివనామ స్మరణతో మృత్యుంజయ కుంట పరిసరాలు మారుమోగిపోతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ఆవరణలో భక్తులు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విచ్చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.

మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం స్వామి వార్లకు వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిపించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అలాగే అర్థరాత్రి వేళ అత్యంత పవిత్రమైన లింగోద్భవ కాల పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.

Related posts

నెల్లూరుకు కేంద్రం భారీ గిఫ్ట్‌…. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హబ్!

Satyam News

పోలీసుల వేధింపులతో ఉర్దూ అకాడమీ ఉద్యోగి ఆత్మహత్య?

Satyam News

తెలంగాణ ‘సర్’​ ముసాయిదా జాబితా విడుదల

Satyam News

తిరుమలలో ఒక్క సారిగా భారీ వర్షం

Satyam News

డ్రగ్స్ టెస్టుకు మేం సిద్ధం…మీరు సిద్ధమా?

Satyam News

రెండో అతిపెద్ద మెడికల్ హబ్‌ గా వరంగల్‌

Satyam News

Leave a Comment