కడపహోమ్

రాజంపేట టిడిపి బలోపేతానికి చర్యలు చేపట్టండి

#PasupuletiBrahmaiah

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో టిడిపి బలోపేతానికి సత్వర చర్యలు చేపట్టాలని కోరుతూ టీడీపీ మాజీ మంత్రి స్వర్గీయ పసుపులేటి బ్రహ్మయ్య తనయుడు వీర పవన్ కుమార్ రాష్ట్ర టీడీపీ అధిష్టానానికి ఒక లేఖ రాసి విజ్ఞప్తి చేశారు.

రాజంపేటలో టిడిపి లో వైసిపి కోవర్టులు చేరి తెలుగుదేశం పార్టీని ముక్కలుగా విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఇటువంటి వారిని గుర్తించి వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి బహిష్కరించి తెలుగుదేశం పార్టీ బలోపేతం కొరకు తక్షణం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మీరు మన దేశంలోనే ఒక దూరదృష్టి గల నాయకులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆదర్శప్రాయులు.

అయితే, రాజంపేటలో టిడిపిని బలోపేతం చేసే విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదనే భావన కార్యకర్తలలో బలంగా ఉందన్నారు. రాజంపేట టిడిపి నాయకత్వంలో నిరంతర మార్పుల కారణంగా 2009 నుండి పార్టీ ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఈ లేఖ ద్వారా మీకు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

2009 ఎన్నికలలో చివరి నిమిషంలో ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చి, కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన మదన్ మోహన్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. వాస్తవానికి, పసుపులేటి బ్రహ్మయ్య పార్టీకి అత్యంత విధేయుడిగా ఉంటూ పార్టీని, కార్యకర్తలను బలోపేతం చేశారు.1994 నుండి 2004 వరకు రాజంపేట నియోజకవర్గాన్ని అపూర్వంగా అభివృద్ధి చేశారు. ఆయన తన ఆస్తులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పార్టీ కోసం పనిచేశారు,

కానీ బ్రహ్మయ్య ను కాదని మదన్ మోహన్ రెడ్డి కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఫలితంగా, ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. 2012 ఉప ఎన్నికలలో మదన్ మోహన్ రెడ్డి గారు పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదు. అప్పుడు, 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే 2014 సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనే హామీతో పసుపులేటి బ్రహ్మయ్య కు టికెట్ ఇచ్చారు.

అప్పటికే వైయస్ రాజశేఖర రెడ్డి మరణం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి పై సానుభూతి బలంగా ఉండటంతో టిడిపి గెలిచే అవకాశం లేదని అందరికీ తెలిసినప్పటికీ, మళ్లీ పసుపులేటి బ్రహ్మయ్యకు టికెట్టు ఇవ్వడంతో 2012 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పొందారు.

2014 ఎన్నికలలో కూడా చివరి నిమిషంలో బ్రహ్మయ్య ను కాదని కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన మేడా మల్లికార్జున రెడ్డి కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. పసుపులేటి బ్రహ్మయ్య 2012 నుండి 2014 వరకు పార్టీని బలోపేతం చేసినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా 2014 ఎన్నికల్లో మేడా మల్లికార్జున రెడ్డి కి టికెట్ ఇచ్చారు.

ఆ ఎన్నికల్లో గెలిచి 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న సమయంలో మేడా మల్లికార్జున రెడ్డి అధికారాన్ని అనుభవించి 2019 సాధారణ ఎన్నికలకు ముందే పార్టీని విడిచిపెట్టారు. 2019 ఎన్నికలలో కూడా ఎటువంటి పదవి ఆశించకుండా పార్టీకి విధేయుడిగా సేవలు అందించిన పసుపులేటి బ్రహ్మయ్య కూకాకుండా బత్యాల చెంగల్ రాయుడు కుఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.

ఆ 2019 ఎన్నికల్లో చెంగల్ రాయులు కూడా ఓటమి చెందారు. బత్యాల చెంగల్ రాయులు 2019 నుంచి 2024 వరకు రాజంపేట నియోజక వర్గ టీడీపీకి పెద్దదిక్కుగా సేవలందించారు. కానీ 2024 ఎన్నికలలో బత్యాల చెంగల్ రాయులు ని కాదని రాయచోటికి చెందిన సుగవాన్ బాల సుబ్రహ్మణ్యం కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.

ఆ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఘనవిజయం సాధించినప్పటికీ, రాజంపేట నియోజకవర్గంలో మాత్రం పార్టీ ఓడిపోయింది. ఎన్నికల్లో ఓటమి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ను కాదని చమర్తి జగన్ మోహన్ రాజు కూ టిడిపినియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారు.

అయితే ప్రస్తుతం రాజంపేట నియోజక వర్గంలో టిడిపి ముసుగులో ఉన్న వైసిపి నాయకులు గొడ్డలి పార్టీ నేతలతో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీని స్థానిక సంస్థల్లో దెబ్బతీయాలని దురుద్దేశంతో వైసిపి నాయకుల ఆర్థిక సహాయ సహకారాలతో పార్టీ ఇన్చార్జి కి వ్యతిరేకంగా సమావేశం నిర్వహిస్తూ వారిలో వారే బహిరంగంగా ఘర్షణ పడుతూ రోడ్డెక్కుతున్నారు.

కనుక రాజం పేట టిడిపిలో వర్గాలను కట్టడి చేసేందుకు సత్వర చర్యలు చేపట్టాలని వివరించారు. అదేవిధంగా రాజంపేటలో టిడిపి పార్టీ సుదీర్ఘ కాలం మనుగడ సాగించాలంటే నియోజకవర్గానికి బలమైన నాయకత్వం అవసరం అని పేర్కొన్నారు.

దయచేసి యువతకు ఒకసారి అవకాశం కల్పిస్తే పార్టీని, కార్యకర్తలను శక్తివంతులను చేస్తారని ఆశిస్తున్నానని సీఎంకు పంపిన లేఖలో పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా (2014-2026) రాజంపేటలో ుపూ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పార్టీ ని 2014 నుండి 2019 అధికారంలో ఉన్నప్పటికీ, నిజమైన టిడిపి నాయకులకు కార్యకర్తలకు ఎటువంటి ప్రయోజనం చేకూరాలేదన్నారు.

అంతర్గత వర్గపోరు కారణంగా టిడిపి కార్యకర్తలు వర్గాలుగా విడిపోయారు. ఆ చాలా మంది కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. పిల్లల చదువులకు, వివాహాలకు డబ్బు లేక సతమతమవుతున్నారు, అలాగే మెరుగైన వైద్యం కోసం కూడా తగినంత డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు.

అంతేకాకుండా, o=జూ ప్రభుత్వ హయాంలో వారిపై అక్రమ కేసులు కూడా నమోదయ్యాయి. ఇన్ని సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, వారు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకే అండగా నిలుస్తున్నారంటే. ఇదే డిపి పార్టీ గొప్పతనం అన్నారు నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారుతున్నా, కష్టకాలంలో అసలైన కార్యకర్తలు పార్టీతోనే నిలిచారన్నారు.

కావున పార్టీ కార్యకర్తలను బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ పాఠశాలలను ఏర్పాటు చేసి, కార్యకర్తల పిల్లలకు తక్కువ ఫీజుతో విద్యను అందించాలని అలాగే, కార్యకర్తల ఆరోగ్య పరీక్షలు మరియు చికిత్స కోసం ప్రతి జిల్లాలో 2-3 స్థానిక ఆసుపత్రులతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఒప్పందం కుదుర్చుకుని, అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

వైభవోపేతంగా శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Satyam News

శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్సైట్లు

Satyam News

సనత్ నగర్‌లో రావణ దహనంలో పాల్గొన్న తలసాని

Satyam News

ఏపీకి అవినాష్ రెడ్డి తండ్రి… కడపలో హై టెన్షన్‌.!

Satyam News

బాణసంచా పరిశ్రమలో పేలుడు:18 మంది మృతి

Satyam News

జగన్‌కు RSS చీఫ్‌ వార్నింగ్!

Satyam News

Leave a Comment