26.3 C
Hyderabad
September 19, 2026
క్రీడలుహోమ్

సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ నిరాశ

సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ నిరాశ పర్చింది. తాజాగా లఖ్నవూ సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో పోరాడి ఓడింది. సన్రైజర్స్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని లఖ్నవూ 5 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ రిషభ్ పంత్ (68 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో ప్రస్తుత సీజన్లో హైదరాబాద్కు రెండో ఓటమి ఎదురైంది. ఇక సన్రైజర్స్ బౌలర్లలో హర్ష్ దూబే 2, ఎషన్ మలింగ, శివాంగ్ కుమార్ చెరో 1 వికెట్ పడగొట్టారు.

లఖ్నవూ తొలి నుంచి విజయం దిశగానే సాగింది. ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ (45 పరుగులు) రాణించాడు. పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. అయితే చివర్లో వికెట్లు తీసి లఖ్నవూపై సన్రైజర్స్ కాస్త ఒత్తిడి తెచ్చింది. 30 బంతుల్లో 43 రన్స్ కావాల్సిన దశలో 16వ ఓవర్లో ఉనాద్కత్ 14 పరుగులు ఇచ్చాడు. దీంతో మ్యాచ్ లఖ్నవూ వైపునకు మొగ్గింది. అయితే 18వ ఓవర్లో హర్ష్ దూబే ఆరే పరుగులిచ్చి 1 వికెట్ తీయడంతో మళ్లీ ఉత్కంఠ మొదలైంది.

కానీ, పంత్ ఎక్కడా అనవసర షాట్లకు పోకుండా జట్టును విజయం వైపునకు నడిపించాడు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా స్ట్రైకింగ్లో ఉన్న పంత్ తొలి రెండు బంతులను ఫోర్లుగా మలిచి బౌలర్ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత రెండు బంతులు డాట్ కావడంతో 2 బంతుల్లో 1 పరుగు కావాల్సి వచ్చింది. ఇక ఐదో బంతిని బౌండరీకి తరలించిన పంత్ లఖ్నవూకు తొలి విజయం ఖాయం చేశాడు.

Related posts

చమురు ఎగుమతులతో ఇరాన్ కు భారీ ఆదాయం

Satyam News

తోపుడు బండ్ల వ్యాపారుల నుండి అక్రమ వసూళ్లు

Satyam News

విశాఖ స్టీల్ ప్లాంట్‌ రికార్డ్‌… జనవరిలో భారీ లాభాలు

Satyam News

అయోధ్య రామమందిర విరాళాల చోరీ: 150 మంది దొంగలు?

Satyam News

బ్రెజిల్ లో లిథియం మైనింగ్ కి సింగరేణి

Satyam News

ఐస్ క్రీమ్ లో వీర్యం కలిపిన ఘనుడు

Satyam News

Leave a Comment