కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టును బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధి బృందం నేడు సందర్శించింది. ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన సభకు భూపాలపల్లి జిల్లా మేడిగడ్డకు విచ్చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ సూటి ప్రశ్నలు సంద్ధించింది.
మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడాన్ని సాకుగా చూపి గత రెండున్నర ఏళ్ళుగా కాళేశ్వరం పై బురదజల్లుతూ కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలా లేదా?
దీని మరమ్మతులకు నిర్మాణ సంస్థ L&T ముందుకు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని రోజులు అనుమతులు ఎందుకు ఇవ్వలేదు?
2023 అక్టోబర్‌లో NDSA పరిశీలన, నవంబర్ 2023లో ఇంటరిమ్ రిపోర్ట్, ఏప్రిల్ 2025లో ఫైనల్ రిపోర్ట్ వచ్చినప్పటికీ విజిలెన్స్, ఘోష్ కమిషన్, CBI దర్యాప్తులు, L&Tతో డిస్‌ప్యూట్, మాన్సూన్ అంతరాయాలు, ఫైనాన్షియల్/టెక్నికల్ స్టడీల పేరుతో రెండున్నరేళ్లు ఎందుకు కాలయాపన చేశారు?
తెలంగాణ జీవధార అయిన ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ బ్లేమ్ గేమ్ కోసం వాడుకున్నదే నిజం కాదా?
కాళేశ్వరం ప్రాజెక్టును “ఫెయిల్డ్/అన్‌యూజబుల్” అని చెప్పి ఇప్పుడు మళ్లీ రిపేర్ పేరుతో ముందుకు రావడం ద్వందనీతి కాదా?
2023 అక్టోబర్ 21-22 రాత్రి మేడిగడ్డ కుంగడంపై పేలుళ్ల అనుమానంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయబడింది. ఆ కేసు పరిస్థితి ఏమైంది?
2023 అక్టోబర్‌లో పిల్లర్లు కుంగిపోయి దాదాపు రెండు సంవత్సరాలు గడిచినా మరమ్మతులు చేపట్టకుండా ఎందుకు నిర్లక్ష్యం చేశారు?
సాగునీరు, హైదరాబాద్ తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిసినా వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదు?
NDSA సిఫార్సులు వచ్చిన వెంటనే అమలు చేయకుండా రెండు సంవత్సరాలు ఆలస్యం చేయడం ఇది స్పష్టమైన నిర్లక్ష్యం కాదా?
బీఆర్‌ఎస్ పాలనలో నిర్మాణ లోపాలంటూ విమర్శించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరమ్మతులు, నిర్వహణ పట్ల అలసత్వం చూపడం డబుల్ స్టాండర్డ్ కాదా?
2026 ఏప్రిల్ వరకు బేస్ క్యాంప్, బోరు బావులు, మెషినరీ ఏర్పాటు చేయకుండా ఆలస్యం చేసి ఇప్పుడు ఒక్కసారిగా శ్రద్ధ చూపడం రాజకీయ స్టంట్ కాదా?
మేడిగడ్డ బ్యారేజ్ మరింత దెబ్బతినకుండా వర్షాల్లో రక్షించడానికి రెండు సంవత్సరాల్లో ఏ చర్యలు తీసుకున్నారు?
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల మరమ్మతులు ఆలస్యం చేయడం వల్ల రైతులు, హైదరాబాద్ ప్రజలు ఎదుర్కొన్న నష్టానికి ఎవరు బాధ్యులు? ఇది రైతులను మోసం చేయడం కాదా?
రెండున్నరేళ్లుగా కాళేశ్వరం మరమ్మతులను పక్కనపెట్టి “బీఆర్‌ఎస్ అవినీతి ఏటీఎం” అంటూ విమర్శించిన కాంగ్రెస్ — ఇప్పుడు ఒత్తిడి పెరగడంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు అంటూ యూ-టర్న్ తీసుకోవడం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కాదా?
తెలంగాణ రైతుల కల అయిన కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ ఆయుధంగా మార్చి ఘోష్ కమిషన్, CBI దర్యాప్తుల పేరుతో రెండున్నరేళ్లు ఆలస్యం చేసి, ఇప్పుడు మరమ్మతులు చేపట్టడం వెనుక కుట్ర లేదని చెప్పగలరా?
రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని రాజకీయ ATMగా మార్చి మొదట అవినీతి అంటూ, ఇప్పుడు రిపేర్ డ్రామా ఆడుతున్నది వాస్తవం కాదా?
రెండేళ్లు నిద్రపోయిన ప్రభుత్వం రైతులు ఎండలో కాలిపోతుంటే కమిషన్ రిపోర్టుల డ్రామా ఎందుకు చేసింది?
బీఆర్‌ఎస్ నిర్మించిన ప్రాజెక్టును కాంగ్రెస్ కుంగదీసింది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా?
NDSA సిఫార్సులు ఎప్పటినుంచో ఉన్నా ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదు?
రైతుల లక్షల ఎకరాలు ఎండిపోయాయి, హైదరాబాద్ నీటి సరఫరా సంక్షోభంలో పడింది. దీనికి బాధ్యులు ఎవరు?
ఈనెల 20న కేసీఆర్ గారు జగిత్యాలకు వెళ్తున్న నేపథ్యంలో మేడిగడ్డ సందర్శన రాజకీయ డైవర్షన్ కోసమేనా?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భూపాలపల్లి నేలపై అడుగుపెట్టే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి కి లేదు?
