26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

అనంతబాబుకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు?

#MLCAnanthababu

పరారీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును.. జగన్‌ ఇంట్లో దాచిపెట్టారని సంచలన ఆరోపణ చేశారు మహాసేన రాజేశ్‌. రెండు రోజుల్లో అనంతబాబుని చట్టానికి అప్పగించకపోతే.. వేలాది మంది దళితులతో తాడేపల్లి ప్యాలెస్‌ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, వైసీపీ అదినేత జగన్‌.. అనంతబాబుని కాపాడుతున్నారని ఆరోపించారు.

డ్రైవర్‌ని హత్య చేసి.. శవాన్ని డోర్‌ డెలివరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంబాబు.. సాక్ష్యులను ప్రభావితం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ కేసు నుంచి తనను తప్పించే విధంగా సాక్ష్యం చెబితే నాలుగు లక్షలు ఇస్తానని ఆశపెట్టడంతో పాటు.. మాట వినకపోతే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. సాక్ష్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనంతబాబుని అరెస్టు చేసేందుకు అతని ఇంటికి వెళ్లారు. అప్పటికే అనంతబాబు పారిపోయాడు.

రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అతని ఆచూకీ దొరక్కపోవడంతో.. అనంతబాబు మిస్సింగ్‌ వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్‌లో అనంతబాబుని దాచిపెట్టారని మహాసేన రాజేశ్‌ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి కేసుల్లో నిందితులు, సాక్ష్యులు ఒక్కొక్కరుగా మరణిస్తే.. ఇక్కడ ప్రధాన నిందితుడైన అనంతబాబు కనిపించకుండా పోవడం పెద్ద మిస్టరీగా మారింది.

ఇన్ఫర్మేషన్ లీక్ అవడం వల్లే.. పోలీసులు వచ్చేలోగా అనంతబాబు పారిపోయడని విచారణలో తేలింది. అనంతబాబుతో క్లోజ్‌గా ఉంటూ.. కేసు విచారణకు సంబంధించిన కీలక సమాచారాన్ని అతని భార్యకు చెప్పడంతో పాటు.. అరెస్టు గురించి లీక్‌ చేసిన సర్పవరం సీఐకి ప్రభుత్వం వాలంటరీ రిటైర్మెంట్‌ ఇచ్చింది. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు పర్యవేక్షణలో అనంతబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related posts

ట్రంప్ మరో సాహసం: డాలర్ పై సంతకం

Satyam News

విబి-జిఆర్ఏఎంజి ద్వారా శాశ్వ‌త ఆస్తుల క‌ల్ప‌న‌

Satyam News

Satyam News

అగ్నిమాపక శాఖకు అధునాతన వాహనాలు

Satyam News

లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ

Satyam News

బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల ఘటనపై హరీష్ రావు విమర్శలు

Satyam News

Leave a Comment