25.7 C
Hyderabad
September 21, 2026
కృష్ణహోమ్

రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ (RRR) కాన్సెప్ట్ అర్థం చేసుకోండి

మన ఇళ్లలో వృధాగా ఉండే వస్తువులతో పదిమందికి ఉపయోగపడేలా ప్రేమతో, దాతృత్వంతో అందిద్దామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. మనం చేసే చిన్న సాయంతో, పేదవారికి చేయూతనివ్వచన్నారు.

గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఓల్డ్ మున్సిపల్ కార్యాలయ కాంప్లెక్స్లో అన్న క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ (RRR) సెంటర్‌ను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.

ప్రారంభోత్సవం అనంతరం పలువురు చిన్నారులు టెక్స్ట్ పుస్తకాలు, మరికొందరు ఇళ్లలోని పాత వస్తువులను తీసుకురాగా, ఎమ్మెల్యే రాము వాటిని స్వయంగా సెంటర్‌లో ఏర్పాటు చేసిన ర్యాకుల్లో పెట్టారు. పుస్తకాలు అందించిన చిన్నారులను ఆయన అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ… మంచి లక్ష్యంతో పురపాలక సంఘం ఏర్పాటుచేసిన RRR సెంటర్ విజయవంతంలో గుడివాడ ప్రజలు భాగస్వామ్యలు కావాలన్నారు.

ప్రజలు తమ ఇళ్లల్లో వాడకుండా ఉన్న వస్తువులు అంటే , మరి పనికిరానివి కాకుండా ఆట వస్తువులు, బట్టలు, పుస్తకాలు, ఆట బొమ్మలు, చెప్పులు, ఎలక్ట్రానిక్ వస్తువులు.. ఇలా ఇతరులు వాడుకోవడానికి వీలుగా ఉన్నవి ఎన్నో ఉంటాయన్నారు. వాటిని పారేయకుండా RRR సెంటర్‌కు దాతృత్వం గా ఇస్తే, మరోకరికి ఉపయోగపడతాయన్నారు.

RRR కాన్సెప్ట్‌ను అందరూ అర్థం చేసుకోవాలనీ, మీ ఇంట్లో వృథాగా పడి ఉండే బదులు,ఆ వస్తువులను పదిమందికి ఉపయోగపడేలా ప్రేమతో, దాతృత్వంతో ఇవ్వాలన్నారు. మీరు ఇచ్చే ఒక పాత పుస్తకం ఒక పేద విద్యార్థి చదువుకు ఉపయోగపడుతుందనీ, ఒక జత బట్టలు నిరాశ్రయుడికి అండగా నిలుస్తాయన్నారు.

మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ మాట్లాడుతూ…ఈ RRR సెంటర్ పని దినాల్లో అందుబాటులో ఉంటుందనీ, మెప్మా ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో నిర్వహిస్తామన్నారు. చాలా మంచి ఆలోచనతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, గుడివాడ ప్రజలంతా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ టిడిపి అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, అసిస్టెంట్ కమిషనర్ డి శ్రీనివాసరావు, డి ఈ సతీష్ చంద్ర,టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, సయ్యద్ గఫార్,సయ్యద్ జబీన్,శానిటేషన్ ఇన్స్పెక్టర్ అప్పారావు, జనసేన నాయకులు షేక్ నాగూర్ భాష మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

బాధ్యతలు స్వీకరించిన డీజీపీ శివధర్ రెడ్డి

Satyam News

ఘనంగా హైదరాబాద్ సిటీ పోలీసుల హోలీ వేడుకలు

Satyam News

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు

Satyam News

విజ్ఞాన్ యూనివర్సిటీ వద్ద దాడి కేసులో 7గురి అరెస్టు

Satyam News

పాకిస్తాన్ భూభాగమంతా బ్రహ్మోస్‌ పరిధిలోనే…

Satyam News

మైనర్ బాలిక తల్లి బహిరంగ ప్రకటన ఇది….

Satyam News

Leave a Comment