వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రాఫ్ రోజు రోజుకీ పడిపోతూనే ఉంది. అధికారంలో ఉండగా అవినీతి ఆరోపణలు, దోపిడీలు.. దౌర్జన్యాలు.. బూతు రాజకీయాలతో జగన్ ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ అయింది. ప్రతిపక్షంలోకి వచ్చాక పరిస్థితి మెరుగుపడుతుందని.. ఫ్యాన్ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నా నిరాశే మిగిలింది. పవర్‌లో ఉన్న రోజల కంటే.. విపక్షంలోనే జగన్ పరపతి మరింత దిగాజరింది.
పాలిటిక్స్‌లో ఉన్న వాళ్లు మాట్లాడే ప్రతి మాటా.. వేసే ప్రతి అడుగు.. తీసుకొనే ప్రతి నిర్ణయం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. వైసీపీలో పద్ధతిగా రాజకీయాలు చేయడం కంటే.. నిర్లక్ష్యంతో కూడిన అహంకార ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. పార్టీ ఆరంభం నుంచి ప్రత్యర్ధుల మీద ఎదురుదాడి చేసి.. వాళ్లను డిఫెన్స్ పడేసే స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు. 2019 వరకు ఈ వ్యూహం బాగానే పని చేసింది. కానీ 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల జగన్ పాలన చూసిన తర్వాత… వైసీపీ నాయకుల అగ్రెసివ్, అఫెన్సివ్ టాక్టిక్స్ ప్రభావం చూపించడం లేదు.
మరోవైపు సీఎం చంద్రబాబు సారధ్యంలో తెలుగుదేశం పార్టీ.. ప్రతి విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. సమకాలీన రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్.. అపర చాణక్యుడిగా పేరుగాంచిన సీబీఎన్ ముందు జగన్ తేలిపోతున్నారనే చెప్పాలి. ఇక్కడ చంద్రబాబు వ్యూహాల కంటే… ఆయన క్రమశిక్షణ, ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర అభివృద్ధి కోసం చూపిస్తున్న చిత్తశుద్ది, అంకిత భావం వంటి లక్షణాలే.. టీడీపీని తిరుగులేని స్థానంలో నిలబెడుతున్నాయి.
వైసీపీ పరిస్థితి మాత్రం యాథారాజా తథా ప్రజా అన్నట్లుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెతలాగా.. జగన్ లక్షల కోట్లు దోచుకొంటే ఆ పార్టీ నాయకులు వందలు, వేలకోట్లు వెనకేసుకొన్నారు. జగన్ బాబాయ్ మీద గొడ్డలి వేటు పడితే.. ఫ్యాన్ పార్టీ నాయకులు సొంత కుటుంబాల మీద కాకపోయినా.. తోటి పార్టీ నేతలను పైకి పంపిస్తున్నారు. ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని దూరం చేసుకోవడం జగన్‌కి మరో పెద్ద మైనస్‌గా మారింది. ఇటు వైపు ఇన్ని తప్పులు ఉండటం వల్లే.. ప్రతి విషయంలోనూ జగన్ కార్నర్ అవుతున్నారు. ప్రత్యర్ధుల విమర్శలకు సమాధానం చెప్పలేకపోతున్నారు.
స్వయంగా చేసిన తప్పుల కారణంగా జనాల్లో జగన్ పలుచన అయిపోతే.. ప్రత్యర్ధులకు టార్గెట్‌గా మారాడని.. జనాల్లో సానుభూతి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తోంది వైసీపీ బ్యాచ్. కార్యకర్తలు రప్పా రప్పా అంటే సినిమా డైలాగు చెబితే తప్పేంటి అని సమర్ధించిన జగన్.. సొంత పార్టీ నాయకుడు పెద్ద దస్తగిరిని వైసీపీ వాళ్లే రప్పా రప్పా వేసేస్తే నోరెత్తలేకపోతున్నారు. ఈ రప్పా రప్పా బ్యాచ్ మీద జనాలంతా దుమ్మెత్తి పోస్తున్నారని సానుభూతి చూపించాలా.. వీళ్లను మళ్లీ అధికారంలోకి రానిస్తే మనకూ ఇలాంటి పరిస్థితే వస్తుందని భయపడాలా.. ఇది మాత్రం ఎవరికి వారు ఆలోచించుకోవాలి.
