26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

మే 1న శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం

#SriGovindarajaSwamyTemple

చిత్రా పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మే 1వ తేదీన శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం జరుగనుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారు, ఆండాళ్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, చక్రత్తాళ్వార్‌ తదితర దేవేరులు ఊరేగింపుగా బయలుదేరి తనపల్లి రోడ్డులోని పొన్నకాల్వ మండపానికి చేరుకుంటారు.

అక్కడ స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం వాహన మండపంలో సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ గోవిందరాజస్వామి వారు వచ్చే సమయంలో అమ్మ వారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు.

బావగారైన శ్రీ గోవిందరాజస్వామి వారు వచ్చారని శ్రీ పద్మావతీ అమ్మవారు లోపల నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని, అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అక్కడి నుండి స్వామివారు తిరిగి ఊరేగింపుగా బయలుదేరి రాత్రి 9.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు. దీంతో ఉత్సవం ముగుస్తుంది.

Related posts

పెట్రోల్ డీజిల్ సరఫరా బాగుంది.. భయపడద్దు

Satyam News

ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు

Satyam News

మర్డర్ కు దారితీసిన క్రికెట్ మ్యాచ్

Satyam News

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు

Satyam News

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్ధులు

Satyam News

సీనియర్ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

Satyam News

Leave a Comment