మెదక్హోమ్

విధి నిర్వహణలో ఉన్న అధికారిపై కండక్టర్ ‘అటాక్’

#RTCConductor

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో టీజీఎస్‌ఆర్టీసీ చెకింగ్ ఇన్‌స్పెక్టర్‌పై జరిగిన భౌతిక దాడి ఘటనను సంస్థ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిని అడ్డుకోవడమే కాకుండా, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయాణికులను రెచ్చగొట్టి దాడికి పాల్పడిన కండక్టర్ దేవ్‌సోత్ వసంత్  పై కఠినమైన శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

శుక్రవారం ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో, TGSRTC హెడ్ క్వార్టర్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్  పెడ్డదొడ్డి యేసయ్య ఇన్-ఛార్జ్ టిటిఐ, వి.ప్రకాష్ టిటిఐ లు తన బృందంతో కలిసి జహీరాబాద్‌ – నారాయణఖేడ్ మార్గంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఝరాసంగం మండలం కప్పడ్ గ్రామ సమీపంలో నారాయణఖేడ్ డిపోకు చెందిన బస్సు (నెం. TG15-Z-0082) ను తనిఖీ చేశారు. ఆ సమయంలో కండక్టర్ ఒక ప్రయాణికుడి వద్ద నుండి రూ. 20 నగదు తీసుకున్నప్పటికీ, అతనికి టికెట్ జారీ చేయనట్లు అధికారులు గుర్తించారు.

​ఈ నేపథ్యంలో తనిఖీ అధికారులు, నిబంధనల ప్రకారం కండక్టర్‌కు ‘ఛార్జ్ మెమో’ జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆ కండక్టర్ దేవ్‌సోత్ వసంత్ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అధికారులను విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, బస్సులోని ప్రయాణికులను అధికారులపైకి రెచ్చగొట్టాడు. అంతటితో ఆగకుండా తన కాలి చెప్పుతో అధికారులపై దాడికి తెగబడ్డాడు. అధికారుల నుంచి రికార్డులను (Charge Memo & MTD 353 Book)  లాక్కొని  దౌర్జనానికి దిగాడు.

ఈ దాడిలో టిటిఐ ఇన్-ఛార్జ్ యేసయ్య ఎడమ చేతి వేలికి గాయం కాగా, మరో అధికారి వి. ప్రకాష్‌ నుదుటిపై తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధిత చెకింగ్ అధికారి యేసయ్య రాయికోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు క్రైమ్ నంబర్ 46/2026 కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 121(1) (ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో ఉండగా అడ్డుకోవడం మరియు గాయపరచడం) కింద కండక్టర్ దేవ్‌సోత్ వసంత్, దాడిలో పాల్గొన్న ప్రయాణికులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారులను తప్పుదోవ పట్టించేలా కండక్టర్ వ్యవహరించిన తీరుపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

​సిబ్బంది పై దాడులకు పాల్పడితే చర్యలు తప్పవు

ఈ ఘటనపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి  స్పందిస్తూ, సంస్థలో సిబ్బంది  క్రమశిక్షణారాహిత్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. కేవలం టికెట్ లేని ప్రయాణికుడి కేసు నుండి తప్పించుకోవడానికి అధికారులపై  దాడి చేయడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు.   విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై ఇటువంటి దాడులకు పాల్పడితే చట్టపరంగా శిక్షలు తప్పవని, ఉద్యోగులందరూ సహృద్భావ వాతావరణంలో పనిచేయాలని ఆయన సూచించారు.

Related posts

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు?

Satyam News

కార్యకర్తలకు ద్రోహం చేసిన జీవన్ రెడ్డి

Satyam News

ఇరాన్‌లో సైన్యం గుప్పిట్లోకి పాలనా పగ్గాలు!

Satyam News

విద్యా సంఘాల పేరుతో దౌర్జన్యం వద్దు

Satyam News

దుబాయ్ లో చిక్కుకుపోయిన వారు సురక్షితంగా….

Satyam News

రికార్డులు సృష్టిస్తున్న యువ హాకీ క్రీడాకారిణి జ్యోతి సింగ్

Satyam News

Leave a Comment