ముఖ్యంశాలుహోమ్

నారా లోకేష్‌ మార్క్ ఎడ్యుకేషన్…కార్పొరేట్ కోటలు బద్దలు.!

#NaraLokesh

గతంలో పదవ తరగతి ఫలితాలు వచ్చాయంటే చాలు..పత్రికల మొదటి పేజీలు, టీవీ ఛానెళ్ల ప్రైమ్ టైమ్ అంతా  కార్పొరేట్ విద్యాసంస్థల యాడ్స్ తోనే హోరెత్తిపోయేవి. ఏ ఛానెల్ మార్చినా యాడ్స్‌తో చెవులు మోత మోగిపోయేవి. కానీ, దశాబ్దాల చరిత్రలో తొలిసారి ఆ ట్రెండ్ మారింది.

కోట్ల రూపాయలు పోసి కొనే కార్పొరేట్ ప్రకటనల స్థానంలో.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పేద, మధ్యతరగతి విద్యార్థుల చిరునవ్వులు మెరిశాయి. సర్కారీ బడుల్లో చదివి సత్తా చాటిన విద్యార్థుల పేర్లు, ఫోటోలు టీవీల్లో, పత్రికల్లో ప్రముఖంగా కనిపించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త చర్చకు దారి తీస్తోంది.

ఈ అద్భుతం రాత్రికి రాత్రే జరగలేదు. దీని వెనుక విద్యాశాఖలో విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్‌ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, క్షేత్రస్థాయిలో అమలు చేసిన కఠినమైన సంస్కరణలు ఉన్నాయి. ప్రభుత్వ బడులు అంటే కేవలం మధ్యాహ్న భోజనం, నాసిరకం విద్య అనే అపవాదును చెరిపేస్తూ.. కార్పొరేట్ కు దీటుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలన్న లోకేష్‌ పట్టుదలే ఈ ఫలితాలకు అసలు కారణం.

గతంలో టీచర్ల బదిలీలు, రాజకీయ ఒత్తిళ్లతోనే విద్యాశాఖ వార్తల్లో నిలిచేది. కానీ, నారా లోకేష్ పగ్గాలు చేపట్టాక సీన్ మారింది. ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెంచడం, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ విద్యా విధానాన్ని పటిష్టం చేయడంపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు.

సిలబస్ కంప్లీషన్ దగ్గరి నుంచి విద్యార్థుల ప్రగతిపై ఎప్పటికప్పుడు రివ్యూలు చేయడం సత్ఫలితాలను ఇచ్చింది. ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, స్టడీ అవర్స్, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు  పకడ్బందీగా నిర్వహించేలా ఆయన చేసిన నిరంతర పర్యవేక్షణ ఈ అద్భుత విజయానికి బాటలు వేసింది.

ఒకప్పుడు తమ పిల్లల ఫోటోలు పత్రికల్లో, టీవీల్లో రావాలంటే లక్షలు కట్టి కార్పొరేట్ స్కూళ్లలోనే చదివించాలేమో అనుకున్న సగటు తల్లిదండ్రులకు..ప్రభుత్వ బడులు ఆ కలను ఉచితంగా నెరవేర్చాయి. మావాడికి స్టేట్ ర్యాంక్.. ఇదిగో టీవీలో మా అమ్మాయి ఫోటో అంటూ ప్రభుత్వ స్కూళ్లలో చదివించే తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునే పరిస్థితి రావడం విద్యావ్యవస్థలో వచ్చిన అతిపెద్ద సామాజిక మార్పు. ఇది కచ్చితంగా ప్రభుత్వ విద్యపై ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని పెంచే అడుగు.

మొత్తానికి ఏపీ విద్యావ్యవస్థలో నారా లోకేష్‌ తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎంత బలంగా పని చేస్తున్నాయో చెప్పడానికి ఈ ఫలితాలే నిదర్శనం. కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ, పబ్లిక్ స్కూల్స్ ప్రగతి రథం పరుగులు పెడుతోంది. సరైన నాయకత్వం ఉంటే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు ఎలా మారతాయో చెప్పడానికి ఈ పది ఫలితాలు, ఆ టీవీల్లో కనిపిస్తున్న ప్రభుత్వ విద్యార్థుల ఫోటోలే పక్కా ఉదాహరణ.

Related posts

భారత ప్రధాన న్యాయమూర్తి తో సీఎం రేవంత్ భేటీ

Satyam News

మళ్లీ మళ్లీ జగన్ క్రెడిట్‌ చోరీ….

Satyam News

నిన్న కమ్మ ద్వేషం… నేడు.. కాపులతో పాలిటిక్స్..

Satyam News

ఆషాడ బోనాలకు బల్కంపేట ఎల్లమ్మ తల్లి సిద్ధం

Satyam News

ఓటర్ల జాబితా సవరణలో తప్పులు జరిగితే ఊరుకోం

Satyam News

పండగ రోజున లాఠీకి పని చెప్పిన పోలీసులు.

Satyam News

Leave a Comment