పశ్చిమగోదావరిహోమ్

ఆర్ టి ఐ దరఖాస్తులతో బ్లాక్ మెయిల్…?

#RTI

ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజక వర్గం నిడమర్రు మండలం లో ఒక పంచాయతీలో గత కొద్ది రోజులుగా కార్యదర్శికి ఇరువురు ఆర్ టి ఐ దరఖాస్తు దారులకు మధ్య వివాదం చెలరేగుతూ ఉన్నది. ఈ ఇరువురు ఆర్ టి ఐ దరఖాస్తు దారుల్లో ఒకరు మహిళ కూడా ఉన్నట్టు సమాచారం.

ఈ మహిళ  ఆర్ టి ఐ దరఖాస్తుదారుడికి సమీప బంధువు అని అనుకుంటున్నారు. వీరిరువురు పంచాయతీ నిధుల వినియోగం పై ఆర్ టి ఐ దరఖాస్తులు పెట్టడం, కార్యదర్శులను బెదిరించడం బ్లాక్ మెయిల్ చేయడం వీరి ప్రధాన వృత్తిగా చెబుతున్నారు. ఒక్కో పంచాయతీ నుండి లక్షల్లో డిమాండ్ చేసి కోట్లల్లో సంపాదిస్తారని జిల్లాలో చాలా మంది చెప్పుకుంటున్నారు.

పంచాయతీ నిధుల వినియోగం రికార్డుల్లో పొందుపర్చక సమాచారం ఇవ్వడానికి కార్యదర్శి జాప్యం చేయడం తో ఆర్ టి ఐ దరఖాస్తుదారులు కార్యదర్శి తో వివాదానికి దిగారు. ఈ వివాదం జిల్లా పంచాయతీ  అధికారుల వరకు చేరడం తో అధికారులు వీరిరువురు ఆర్ టి ఐ దరఖాస్తు ల పై విచారణ కు రంగం సిద్ధం చేశారు.

అయితే ఇప్పటికే వారిలో ఒక దరఖాస్తుదారు ఆర్ టి ఐ ముసుగులో గత కొద్ది రోజుల నాడు కార్యదర్శి నుండి 1 లక్ష గుంజుకున్నట్టు సమాచారం. అయితే ఇదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన సమీప బంధువైన ఒక మహిళ తో  కలిసి పంచాయతీలలో నిధుల వినియోగం పై ఆర్ టి ఐ దరఖాస్తులు పెట్టి పంచాయతీ కార్యదర్శులతో లక్షల్లో బేరసారాలు కుదుర్చుకుని ఆర్ధిక సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నారు.

లక్షలాది రూపాయలు గుంజుతున్న వైనం ఇదీ….

ఇరువురు ఆర్ టి ఐ దరఖాస్తు దారులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 80 శాతం పంచాయతీలలో సమాచారం కోసం ఆర్ టి ఐ దరఖాస్తులు పెట్టి కార్యదర్శులను బ్లాక్ మెయిల్ చేసి ఒక్కొక్క పంచాయతీ నుండి 50 వేలనుండి 1లక్ష రూపాయల వరకు డిమాండ్ చేశారని తెలిసింది.

పంచాయతీ రాజ్ కమిషనరేట్ లో ఆర్ టి ఐ దరఖాస్తులను పరిశీలించే ఉద్యోగులతో వీరిరువురు ఆర్ టి ఐ దరఖాస్తు దారులకు పరిచయాలు ఉన్నాయని అంటున్నారు. దీనితో ఆ ఉద్యోగులు కూడా ఆరోపణలున్న పంచాయతీ కార్యదర్శులతో చర్చలు జరిపి ఆర్ టి ఐ దరఖాస్తు దారులతో  రాజీచేసుకోమని సలహాలు ఇవ్వడం తో అక్కడే లక్షల్లో బేరసారాలు కుదుర్చుకుని దరఖాస్తు దారులకు కొంత అద్వాన్స్ చెల్లింపులు జరిగిపోతున్నాయనేది సమాచారం.

మిగిలిన సొమ్ములు కొంత గడువు తరువాత కార్యదర్శుల చెల్లిస్తున్నట్టు చాలా మంది పంచాయతీ ఉద్యోగులు గుసగుస లాడుకుంటున్నారు. తాజాగా నిడమర్రు మండలం లో గత వారం రోజులుగా ఒక ఆర్ టి ఐ ద్వారా చేసిన దరఖాస్తు పై విచారణకు వెళ్ల బోయే అధికారులకు ఆ పంచాయతీలో కార్యదర్శి కి ఆర్ టి ఐ దరఖాస్తుదారురాలికి మధ్య ఆర్ టి ఐ ద్వారా దరఖాస్తులు పెట్టే ఆమె బంధువు లక్షల్లో  ముడుపులు తీసుకుని సెటిల్ చేసినట్టు సమాచారం.

ఈ జిల్లాలో ఈ ఇరువురు ఆర్ టి ఐ దరఖాస్తు దారులు ఆర్ టి ఐ ముసుగు లో పంచాయతీలలో చేస్తున్న బ్లాక్ మెయిల్స్ పై జిల్లా అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంతకీ జిల్లా పంచాయతీ అధికారులు ఆ పంచాయతీ పై వచ్చిన పిర్యాదు పై విచారణ జరుపుతారా లేదా అనేది వేచి చూడాలి.

Related posts

జన నాయకన్ ఇక విడుదల కాదా….?

Satyam News

మీడియా అక్రిడిటేషన్ నిబంధనలపై హైకోర్టులో విచారణ

Satyam News

ఘనంగా ముగిసిన జిల్లా పోలీసు వార్షిక క్రీడా సంబరాలు

Satyam News

War Zone: ఇరాన్ దీవులపై అమెరికా దాడులు

Satyam News

సస్పెన్షన్ బాధతో ఏఎస్సై ఆత్మహత్య

Satyam News

నారా లోకేష్ ప్రత్యేకత…. పాజిటివ్ పాలిటిక్స్!

Satyam News

Leave a Comment