26.7 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

కత్వ చెరువు రిపేర్లు వెంటనే మొదలు పెట్టాలి

#KatvaTank

పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్టేడియం దగ్గర, ఆవుల సత్రం దగ్గర కత్వ డ్రైనేజీ కాలవలు, చెరువులలో వ్యర్ధపదార్థాలు పారవేయడం, వాటిని కొందరూ ప్రైవేట్ వ్వక్తులు ఆక్రమించడం జరుగుతుందని దేశ భక్త ప్రజాతంత్ర (పిడిఎం) రాష్ట్ర కార్యదర్శి జి. రామకృష్ణ, జిల్లా కార్యదర్శి షేక్. మస్తాన్వలి అన్నారు. దీంతో వర్షాలు పడినప్పుడు వర్షపు నీళ్లు రోడ్డు మీద ప్రవహిస్తున్నాయని చెప్పారు.

నరసరావుపేట మున్సిపాలిటీ అధికారులు అక్రమణకు గురి అయిన వాటిని తొలగించడం లేదని ఆరోపించారు. నరసరావుపేట మునిసిపాలిటీ ఏటా రూ. 6 లక్షలు ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నారే కానీ, బాగు చేయించాలని చాలా రోజుల నుంచి అధికారులు చెప్పడమే కానీ ఇంతవరకు పనులు మొదలు పెట్టలేదన్నారు.

ఆక్రమణలు తొలగిస్తున్నట్లు అధికారులు హడావిడి చేసి, పైపైన తొలగించినట్లు చేసి చివరికి మౌనం దాల్చున్నారని పేర్కొన్నారు. మైనర్ ఇరిగేషన్, మున్సిపాలిటీ తదితర విభాగాలలో ఉన్నవాళ్లు ఆక్రమణలు తొలగించి పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

Related posts

గోదారోళ్ళ స్టైల్ అదిరింది గా…

Satyam News

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

Satyam News

దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదు

Satyam News

టెలికాం సేవల కోసం TRAI కొత్త యాప్ ఇదే…

Satyam News

రష్యా సైన్యంలోకి బలవంతంగా పంజాబ్ యువకులు

Satyam News

నితిన్ నబీన్ కొత్త టీమ్: ఉపాధ్యక్షురాలిగా పురందేశ్వరి

Satyam News

Leave a Comment