గుంటూరుహోమ్

దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదు

#LavuKsriKrishnadevarayalu

లోక్ సభలో తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) బిల్లుకు పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సంపూర్ణ మద్దతును తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఈ బిల్లులకు ఎందుకు మద్దతు ఇస్తోందని వస్తున్న ప్రశ్నలకు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు శుక్రవారం జరిగిన లోక్ సభలో గట్టి సమాధానం ఇచ్చారు.

గడిచిన స్వతంత్ర భారతంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని, చట్టాల్లో ఎన్నో సవరణలు వచ్చాయి. ఇప్పుడు చట్టసభల్లో మహిళా గళం ఘనంగా వినిపించే చారిత్రక సమయం ఆసన్నమైంది. దేశంలో 50 శాతం ఉండి,  మరింత సాధికారిత కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళల కల ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రస్తుతం సాకారం కాబోతుంది.

అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లుకు తెలుగుదేశం పార్టీ తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. మహిళలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఎంతగానో కృషి చేశారు. తొలిసారి టిడిపి అధికారంలోకి వచ్చాక మహిళల కోసం ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ మహిళలకు ఆస్తిలో సగభాగం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు, మహిళలకు గృహ సదుపాయం వంటివి ఎన్టిఆర్ తెచ్చారు.

అప్పుడు మహిళల అక్షరాస్యత రేటు 25 శాతం ఉండగా, వీరిని మరింత ముందుకు తీసుకెళ్లాలని మహిళల కోసం ఎన్నో స్కూల్స్, ముఖ్యంగా పద్మావతి యూనివర్సిటీ వంటివి ఎన్నో స్థాపించారు. వారి ఆశయాలని కొనసాగిస్తూ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపులను తీసుకురావడం, స్థానిక ఎన్నికల్లో 35 శాతం రిజర్వేషన్లు, ప్రస్తుతం స్త్రీశక్తి, తల్లికి వందనం, దీపం 2.0 వంటి పథకాలతో వారికి బాసటగా నిలవటం, టీడీపీకి మహిళాభ్యున్నతి పట్ల ఉన్న నిబద్దతకు తార్కాణం. 543 సీట్లున్న 815 సీట్లున్న ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ మహిళలకు అండగా నిలుస్తూనే ఉంటుంది.

డిలిమిటేషన్‌పై టీడీపీ వైఖరిని వివరిస్తూ, ఆంధ్రప్రదేశ్ అనుభవాన్ని ఉదాహరణగా చూపించారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన డిలిమిటేషన్‌లో ఆంధ్రప్రదేశ్ ఒక పార్లమెంటరీ నియోజకవర్గం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను తెలంగాణకు కోల్పోయినా, జనాభా మార్పుల వాస్తవాన్ని అంగీకరిస్తూ ఆ నిర్ణయాన్ని మేము స్వీకరించామని పేర్కొన్నారు. 2009 డిలిమిటేషన్ సమయంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం పాల్పడింది.

సమతుల్య ప్రాధాన్యత కచ్చితంగా ఉంటుంది

బలమైన నాయకత్వాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరిగినప్పటికీ, ప్రజలు ఆ రాజకీయాలను తిరస్కరించి వరుసగా టీడీపీకి 4 సార్లు విజయం కట్టబెట్టారని స్పష్టం చేశారు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలపై మాకు పూర్తి నమ్మకం ఉందని, దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదని, సమతుల్య ప్రాతినిధ్యం కొనసాగుతుందని పేర్కొన్నారు.

తక్కువ జనన రేటు, వలసల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో జనాభా వృద్ధి తగ్గిన విషయం మాకు తెలుసు. కేవలం జనాభా ఆధారంగా డిలిమిటేషన్ జరిగితే ప్రాతినిధ్యం తగ్గే అవకాశముంది. అయితే, కేంద్రం ఇచ్చిన హామీలతో ఆంధ్రప్రదేశ్ వాటా 4% వద్ద నిలవడమే కాకుండా, 0.6% పెరిగి 4.6% వరకు పెరిగే అవకాశం ఉందని మేము విశ్వసిస్తున్నామని తెలిపారు.

దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా 1971 జనాభా లెక్కల ప్రకారమే సీట్ల పెంపుదల జరుగుతుంది. ఇప్పటికే దీనిపై హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఒకవేళ 2011 లెక్కల ప్రకారం వెళ్తే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టే ప్రస్తుత శాస్త్రీయ విధానానికి మేం మద్దతిస్తున్నామని పేర్కొన్నారు.

Related posts

దక్షిణ మధ్య రైల్వేలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

Satyam News

పాకిస్తాన్–ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఘర్షణ: 30 మందికి పైగా మృతి

Satyam News

బాక్సైట్ తవ్వకాలపై ప్రజా ప్రతినిధుల ఆగ్రహం

Satyam News

అమెరికా ఇరాన్ మధ్య 60 రోజుల కార్యాచరణ

Satyam News

అమెరికా నౌకాదళంలో భారతీయ బాలిక

Satyam News

యోగాతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత

Satyam News

Leave a Comment