26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

వేడుకగా లక్ష్మీ నరసింహ పుష్పయాగం

#SriLakshimiNarasimha

తిరుపతి జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురం గుట్టపై వెలసిన శ్రీలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్ప యాగం వేడుకగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.బత్తిన గుండాల రెడ్డి, మహేశ్వరి దంపతుల ఆధ్వర్యలో ఈ పుష్ప యాగ కార్యక్రమం వేడుకగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో వేద పండితులు ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం స్వామివారిని అమ్మవార్లను పట్టు వస్త్రాలు స్వర్ణభరణాలు వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక వేదికపై  అలంకరించి కొలువు తీర్చారు. తిరుచానూరు శ్రీ బాలాజి స్వామి వేదపండితుల ఆధ్వర్యంలో మల్లెపూలు, సంపంగి, గులాబీలు, కనకాంబరం విరజాజి, చామంతి, తామర, కలువ, మొగిలి పూలు, గన్నేరు, నంద్యావర్తం, పారిజాతం, మనోరంజితం, పొగడ,మాధవి, బంతి పూలు, పవిత్ర పత్రాలు,తులసి, దవనం,మరువం, బిల్వ పత్రాలు,పన్నీరాకు తో స్వామి అమ్మవార్లకు పుష్ప యాగం చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Related posts

యూ టర్న్ తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

Satyam News

వైసీపీని వణికిస్తున్న చంద్రబాబు ఫినామినా..

Satyam News

డ్రగ్స్, మానవ అక్రమ రవాణ నిరోధంలో ఎస్ఎస్ బి సేవలు భేష్

Satyam News

అగ్నివీర్ పాలసీలో భారీ మార్పులు….?

Satyam News

స్విట్జర్లాండ్ నుంచి స్వదేశానికి సీఎం చంద్రబాబు

Satyam News

కాంగ్రెస్ వేధింపులతో బిజెపి నాయకుడు ఆత్మహత్య

Satyam News

Leave a Comment