26.3 C
Hyderabad
September 19, 2026
కృష్ణహోమ్

ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం పొడిగింపు

#SaiprasadIAS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు అనగా జూన్ 1 నుండి నవంబరు 30 వరకు పొడింగించింది.రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆల్ ఇండియా సర్వీసెస్(AIS) రూల్ 16(1)(DCRB)రూల్స్ 1958 కు అనుగుణంగా సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు మాసాలకు పొడిగిస్తూ కేంద్ర డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరి రాజేశ్ కుమార్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపపాలన శాఖ(పొలిటికల్)ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియ జేశారు.

ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న సాయి ప్రసాద్ వాస్తవానికి ఈనెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఆమేరకు కేంద్ర ప్రభుత్వం సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు మాసాలు అనగా జూన్ 1 నుండి నవంబరు 30వ తేదీ వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts

తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి జగన్

Satyam News

బ్లాక్ మార్కెట్ లో నకిలీ సిగరెట్లు

Satyam News

సంక్రాంతి కానుకగా ప్రభాస్ నిమ్మల”మిరాకిల్” ఫస్ట్ లుక్!!

Satyam News

తప్పిపోయిన బాలికను 2 గంటల్లో గుర్తించిన తిరుపతి పోలీసులు

Satyam News

హోర్ముజ్ జలసంధిని తెరిచేశాం: డోనాల్డ్ ట్రంప్

Satyam News

ఉచిత వైద్య శిబిరం విజయవంతం

Satyam News

Leave a Comment