26.3 C
Hyderabad
September 19, 2026
అనంతపురంహోమ్

శ్త్రీ శక్తి డిజిటల్ మహానాడుకు అనంతపురంలో ఘన ఏర్పాట్లు

#VenkateshPrasadMLA

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పిలుపునిచ్చారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గ అబ్జర్వర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన మాట్లాడుతూ, మే 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో శ్త్రీ శక్తి డిజిటల్ మహానాడు థీమ్‌తో మహానాడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి క్లస్టర్ పరిధిలో కనీసం 500 మంది కార్యకర్తలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్న ఈ మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలని కోరారు. అనంతపురం జిల్లా టిడిపికి కంచుకోట అని పేర్కొంటూ, పార్టీ నిబంధనలు, సూచనలు పాటిస్తూ కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని అన్నారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాల సాధనకే మహానాడు వేదిక కావాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, అనంతపురం అర్బన్ టిడిపి ప్రెసిడెంట్ సుధాకర్  పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

దేశం లో ఏకాకి అయిన వైసీపీ

Satyam News

మీ గెలుపు మాకు గర్వకారణం

Satyam News

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు?

Satyam News

IBM వచ్చేసింది….. విశాఖలో ఆఫీస్ ప్రారంభం

Satyam News

అటవీ ఉత్పత్తులతో స్థానికంగానే ఉపాధి అవకాశాలు

Satyam News

ప్రొఫెసర్ తో వైసీపీ గేమ్స్…. బ్లూ మీడియాలో ఫేక్‌ స్టోరీ

Satyam News

Leave a Comment