ఆధ్యాత్మికంహోమ్

శ్రీశైలం దేవస్థానం హుండీ ఆదాయం రూ.5 కోట్ల పైనే

#Srisailam

పవిత్ర పుణ్య క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో హుండీల లెక్కింపు విజయవంతంగా పూర్తయింది. హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.  5,28,37,281/- లు నగదు రాబడిగా లభించింది. కాగా  ఈ హుండీల రాబడిని భక్తులు గత 33 రోజులలో  (23.04.2026 నుండి 25.05.2026 వరకు)  సమర్పించడం జరిగింది.

అలాగే  ఈ హుండీలో 96 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 3 కేజీల 780 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా  321 – యుఎస్ఏ డాలర్లు,   20 – యు.ఏ.ఇ దిర్హమ్స్,  2- సింగపూర్ డాలర్లు, 25 – ఇంగ్లాండు పౌండ్స్ ,  14– మలేషియా రింగిట్స్ ,  35– ఆస్ట్రేలియా డాలర్లు,  1 – కువైట్ దీనార్,    105 – కెనడా డాలర్లు,    200 – ఓమన్ బైసాలు, 5 – కత్తారు రియాల్స్  మొదలైనవి  ఈ హుండీల లెక్కింపులో లభించాయి.

పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది. ఈ హుండీల లెక్కింపును కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు  పర్యవేక్షించారు. హుండీల లెక్కింపులో ధర్మకర్తల మండలి సభ్యులు కె. కాంతివర్థిని కూడా పాల్గొన్నారు. అదేవిధంగా  పలువిభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు.

Related posts

ఓటరు జాబితా సవరణకు సుప్రీంకోర్టు సపోర్టు

Satyam News

వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతున్న నేతలు

Satyam News

హోర్మోజ్ జలసంధి నుంచి 90 శాతం ట్యాంకర్ల బంద్

Satyam News

విజయవాడలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్‌

Satyam News

ఈ కేసేంటి..మీ కథేంటి..ఆళ్లకు హైకోర్టు చుక్కలు

Satyam News

మంత్రి లోకేష్ సమర్థతకు దక్కిన గుర్తింపు

Satyam News

Leave a Comment