ఈ ఏడాది జూన్ 1 నుంచి అమల్లోకి విశాఖ రైల్వే జోన్ అమల్లోకి వస్తోందని ఏపీ రాష్ట్ర ఎన్.ఆర్.ఐ,సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి స్పష్టం చేసారు.ఈ మేరకు విజయనగరం ఆర్ అండ్. బీ వద్ద తన క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆ వచ్చే నెల జూలైలో బోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభంమన్నారు.
ఇక మహాడు లాంటి పెద్ద పండగలో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. 1875 క్లస్టర్లలో వర్చువల్‌గా నిర్వహించిన మహానాడు ఎన్నో అద్భుతాలకు కేంద్రబిందువు అయయిందన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో, నియోజకవర్గంలో హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించిన మహానాడు విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
గజపతినగరం నియోజకవర్గంలో మహానాడు విజయవంతం చేసిన పార్టీ మండల అధ్యక్షులకు, క్లస్టర్ ఇంచార్జిలకు, వివిధ హోదాలలో ఉన్న చైర్మన్ లకు, కార్యక్రమంలో పాల్గొన్న పసుపు సైన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహానాడు వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి నినాదంతో అనేక తీర్మానాలు చేయడం, మహిళలకు 33 % రిజర్వేషన్లు, వుమెన్ సేఫ్టీ, వుమెన్ ఎంపవర్‌మెంట్ అన్నీ టీడీపీలో మహిళా సాధికారితకు నిదర్శనం అన్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయటం పట్ల మంత్రి కొండపల్లి హర్షం వ్యక్తం చేశారు. గరివిడి ఫ్యాక్టరీని ఎవరు టేకోవర్ చేసినా… ఫ్యాక్టరీ కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని, జూన్ 1 నుంచి విశాఖ రైల్వే జోన్ అమల్లోకి వస్తోందని తెలిపారు. జోన్ కోసం అవిశ్రాంత కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, జోన్ ఇచ్చి ఏపీ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారికి ధన్యవాదాలు తెలిపారు.
జూన్ 30 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ యాక్సెస్ రోడ్స్, రైతుల సమస్యలు పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో నిరుద్యోగిత తగ్గించాలంటే పరిశ్రమలు జిల్లాకు రావాలనీ, భూసేకరణ విషయంలో రైతులను ఒప్పించాలనీ, వారికి భరోసా కల్పించడంతో పాటు నష్టపోకుండా పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ రోజు హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందడానికి నాటి చంద్రబాబు గారి ముందుచూపు కారణమని, రైతులను ఒప్పించి భూసేకరణ చేయడమే ఎంతో కీలకం అని, రైతులకు కష్టం లేకుండా భూసేకరణ చేసేలానే ముందుకు వెళతామని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 19 ఎంఎస్ఎంఈ పార్కుల్లో 800 కంపెనీల పనులు ప్రారంభమయ్యాయి. మరో 81 పార్కుల పనులు మరో 3 నెలల్లో పూర్తవుతాయి. మొన్న ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్‌లో మరో 38 పనుల శంకుస్థాపన కూడా సీఎం గారు చేశారు… జిల్లా కేంద్రం విజయనగరంలోనూ ఎంఎస్ఎంఈ పార్కు కేటాయించడం జరిగిందన్నారు. పెద్ద పరిశ్రమల్లో కోటి రూపాయల పెట్టుబడి పెడితే ఒక్కరికే ఉద్యోగం వస్తుందని, ఎంఎస్ఎంఈలో అదే కోటికి 10 మందికి పైగా స్థానికులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎంస్ఎంఈ పార్కుల్లో ఇండస్డ్రీలు వచ్చేలా స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టారని… ప్రతిపక్షం 200 కేసులు వేసినా విజయవంతంగా 16 వేలమందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
గ్రూప్ 1 పేపర్ల వాల్యూషన్ ప్రైవేటు రిసార్ట్స్‌లో చేసింది వైసీపీ ప్రభుత్వమేనని, ఇది ఎంత వరకు సమంజసమో ఆ పార్టీ నేతలే ఆలోచించుకోవాలన్నారు. అంగన్వాడీల విషయంలో ఐసీడీఎస్ అధికారుల చర్యలపై నా పాత్ర లేదనీ, తప్పుచేసిన వారి విషయంలో కలెక్టర్ చర్యలు తీసుకున్నారని మంత్రి కొండపల్లి స్పష్టం చేశారు.
