ప్రత్యేకంహోమ్

ఫేక్ జీవో లతో ప్రభుత్వ భూమి కొట్టేసిన వైసీపీ లీడర్

ఫేక్ జీవో లతో ప్రభుత్వ భూమి కొట్టేసాడు ఒక వైసీపీ నాయకుడు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈ నేరానికి పాల్పడినట్లు తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ శివార్లలోని గండిపేట పరిధిలో దాదాపు 1500 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించిన భారీ భూ కుంభకోణాన్ని శేరిలింగంపల్లి పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు.

గండిపేటలోని సర్వే నంబర్ 18లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ జీఓల (ప్రభుత్వ ఉత్తర్వులు) ద్వారా తమ సొంతం చేసుకునేందుకు ఒక ముఠా ప్రయత్నించింది. “ప్రభుత్వం ఈ భూమిని క్రమబద్ధీకరించింది” అంటూ సోషల్ మీడియా, వాట్సాప్‌లలో తప్పుడు ప్రచారం చేస్తూ నకిలీ పత్రాలను సృష్టించారు. ఈ భూమిపై గతంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్లను 2025లోనే కోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ, ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేకపోయినా ఈ భూమిని విక్రయించేందుకు నిందితులు కుట్ర పన్నారు. ఎకరాకు రూ. 3.5 కోట్ల చొప్పున విక్రయించేందుకు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ అక్రమ భూ లావాదేవీల్లో ఇప్పటికే రూ. 4 కోట్లు చేతులు మారినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ మోసంపై గండిపేట తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోర్టు ఆదేశాల ప్రకారం నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి, ఫోర్జరీ పత్రాలు, బ్యాంక్ పాస్‌బుక్స్, మొబైల్ ఫోన్లు మరియు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్రాలు తయారు చేసిన ముఠాకు చెందిన నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయికిరణ్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు బొల్ల రమేష్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. బొల్ల బ్రహ్మనాయుడు నుంచి రెండు విడతల్లో రూ. 1 కోటి 25 లక్షలు నిందితుల ఖాతాలకు బదిలీ అయినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.

ప్రస్తుతం బొల్ల బ్రహ్మనాయుడు, బొల్ల రమేష్ పరారీలో ఉన్నారు. ఈ కేసుతో సంబంధమున్న మరో నలుగురి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ప్రజలు ఎవరైనా భూములు కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

Related posts

సేవా తత్వాన్ని సహించలేనిది ప్రత్యర్థి పార్టీ నాయకులా?

Satyam News

ఇక పిల్లలకు నో సోషల్ మీడియా…..

Satyam News

ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ

Satyam News

మాట నిలబెట్టుకున్న లోకేష్…. పేద ముస్లిం ఫ్యామిలీకి రంజాన్‌ కానుక…!!

Satyam News

ఏపీకి రష్యన్ టెక్నాలజీ…… పెట్టుబడుల వేటలో లోకేశ్ స్మార్ట్ స్కెచ్!

Satyam News

ఏపీ స్పేస్‌ సిటీలో.. రాకెట్ ఇంజన్‌ టెస్టింగ్‌ సెంటర్..

Satyam News

Leave a Comment