ఆధ్యాత్మికంహోమ్

వైభవోపేతంగా శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

#MaddadaRavichandra

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా, మరింత ఆధ్యాత్మిక శోభ కనిపించేలా నిర్వహించనున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను టిటిడి జేఈవో లు వి వీరబ్రహ్మం, డా. ఎ.శరత్, సివిఎస్వో కే వి మురళీకృష్ణ లతో కలిసి టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శనివారం ఆవిష్కరించారు.

తిరుపతిలోని టీటీడీ నివాస గృహంలోని ఈవో ఛాంబర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయ వైభవాలకు ప్రతీకగా నిలిచేలా అన్ని శాఖలు సమన్వయంతో విశేష ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళ కళ లాడేలా చలువ పందిళ్లు, ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలు, రంగురంగుల ముగ్గులు, పుష్పాలంకరణలు, వైట్ పెయింటింగ్‌, సాంప్రదాయ చిత్రకళా అలంకరణలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు తదితర ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

మే 22న సాయంత్రం 5.30 గంటల నుండి 8 గంటల వరకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మే 23న ఉదయం 7.35 గంటల నుండి 8.49 గంటల వరకు మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.

ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు నిర్వహించనున్న వాహనసేవలు భక్తి పారవశ్యాన్ని పంచనున్నాయి. ముఖ్యంగా మే 27న గరుడవాహన సేవ, మే 30న రథోత్సవం బ్రహ్మోత్సవాలకు ఆకర్షణగా నిలవనున్నాయి.

వాహనసేవల విశేషాలు

24.05.2026 – ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం

25.05.2026 – ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం

26.05.2026 – ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం

27.05.2026 – ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం

28.05.2026 – ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం

29.05.2026 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం

30.05.2026 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం

31.05.2026 – ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, ఆలయ అర్చకులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

లక్షలాది రూపాయల దుర్వినియోగంపై సీఎంకు ఫిర్యాదు

Satyam News

స్కూల్లో నే డ్రగ్స్ తయారీ

Satyam News

48 శాతం తగ్గిన సీజనల్ వ్యాధులు

Satyam News

మంత్రి నారాయణ విదేశీ పర్యటన

Satyam News

అల్లిపూడిలో అరాచకం: నేర చరిత్ర ఉన్న వైకాపా నేత దౌర్జన్యాలు

Satyam News

వైసీపీ సింపతీ ఫార్ములాకు ఎక్స్‌పైరీ డేట్.. జనాల్లో రివర్స్ ఎఫెక్ట్‌!

Satyam News

Leave a Comment