26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

అమరావతి, విశాఖ నగరాల్లో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్

రష్యన్ పారిశ్రామికవేత్తలు, మేనేజర్లు, ఫండ్ నిర్వాహకుల కన్సార్టియంతో ఏర్పాటైన యాండెక్స్ (Yandex) సంస్థ ఉన్నతస్థాయి బృందంతో ఏపీ మంత్రి నారా లోకేష్ మాస్కోలో భేటీ అయ్యారు. యాండెక్స్ టెక్ డిప్యూటీ సీఈవో అలెగ్జాండ్రా ష్కిపినా-సాంచెజ్, యాండెక్స్ ట్రాన్స్ పోర్ట్ డిప్యూటీ సీఈవో డెనిస్ కాసిమోవ్, యాండెక్స్ క్లౌడ్ ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్ మెంట్ డైరెక్టర్ మారట్ నూరియేవ్, యాండెక్స్ మేనేజర్ ఫర్ గ్లోబల్ గవర్నమెంట్ ఎఫైర్స్ & పబ్లిక్ పాలసీ నికితా పోపోవ్ లతో స్బేర్ సిటీలో లోకేష్ సమావేశమయ్యారు.

అమరావతి రాజధాని నగరం, విశాఖపట్నం AI డేటా సెంటర్ అంతటా యాండెక్స్ స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, ప్రిడిక్టివ్ ట్రాన్సిట్ షెడ్యూలింగ్, కంప్యూటరైజ్డ్ పబ్లిక్ సేఫ్టీ అనలిటిక్స్‌ను అమలు చేయడంపై మంత్రి లోకేష్ చర్చించారు. లాస్ట్-మైల్ రవాణా ఖర్చులను తగ్గించడానికి, భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న హైపర్-లోకల్ క్విక్-కామర్స్, డెలివరీ ఫ్లీట్‌లలోకి యాండెక్స్ అధునాతన అటానమస్ వెహికల్ స్టాక్, ప్రిడిక్టివ్ రూటింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఇంటిగ్రేట్ చేయడానికి గల అవకాశాలను అధ్యయనం చేయాలని సూచించారు.

భారతదేశంలో స్థానిక ప్రజా పరిపాలన సాధనాలకు యాండెక్స్ ఫౌండేషన్ AI మోడల్స్ & హై-పెర్ఫార్మెన్స్ క్లౌడ్ ఫ్రేమ్‌వర్క్‌లకు లైసెన్స్ మంజూరు అంశంపై సమావేశంలో చర్చించారు.

Related posts

ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవం

Satyam News

ఒకేసారి లక్ష మంది ప్రయాణికులు….

Satyam News

లీక్ వీరులకు షాక్: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు

Satyam News

దేవదేవుడికి అపచారం చేశాం: రోజా, జోగి టాక్ లీక్

Satyam News

హరీష్ రావుపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి

Satyam News

ఓటమి భయంతో జగన్‌ పరార్‌…!!

Satyam News

Leave a Comment